Census 2027: జనగణనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా.. భారీ బడ్జెట్
Census-2027 (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Census 2027: జనాభా లెక్కలకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా.. భారీ బడ్జెట్ కేటాయింపు

Census 2027: జన గణన-2027కు (Census 2027) మార్గంసుగుమం అయ్యింది. జనాభా లెక్కలకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారధ్యంలోని కేంద్ర కేబినెట్ (Central Cabinet) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల నిర్వహణ కోసం రూ. 11,718 కోట్ల బడ్జెట్ కేటాయిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ప్రకటించారు. మొట్టమొదటిసారిగా 2027 జనాభా లెక్కలు డిజిటల్ రూపంలో గణన జరుగుతుందని వైష్ణవ్ తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ప్లాట్‌ఫామ్‌లకు అనుకూలమైన మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించి డేటా సేకరిస్తామని వివరించారు. ప్రక్రియ మొత్తం రియల్ టైమ్‌లో జరుగుతుందని, గణనను పర్యవేక్షించేందుకు ఒక సెంట్రల్ మెయింటనెన్స్ అండ్ మోనిటరింగ్ సిస్టమ్ (CMMS) పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మెరుగైన ప్రణాళిక, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తామని, క్రియేటర్ వెబ్ మ్యాప్ అప్లికేషన్‌ను కూడా ఉపయోగిస్తామని వివరించారు.

Read Also- Kamalapur Election: తెర వెనుక రాజకీయాలైనా ప్రజా తీర్పే ధ్యేయం.. కమలాపూర్‌లో ధర్మమే గెలిచిందంటూ..!

రెండు దశల్లో జనగణన

2027 జనాభా లెక్కల నిర్వహణ ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక ప్రక్రియ అని ఆయన అభివర్ణించారు. 2027 జనాభా లెక్కలు దేశంలో 16వ లెక్కలు కానుండగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 8వ గణన నిలవనుంది. జనాల లెక్కల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో ఇళ్ల నమోదు, ఇళ్ల గణన జరుగుతుంది. ఈ ప్రక్రియ 2026 ఏప్రిల్ – సెప్టెంబర్ మధ్య నిర్వహిస్తారు. ఇక, రెండో దశ జనాభా లెక్కింపులో జనాభా లెక్కలు జరుగుతాయి. అందులో జనగణన చేపడుతారు. ఈ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది. అయితే, మంచుతో కప్పి ఉండే లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఉండే ప్రాంతాల్లో ముందుగానే, అంటే సెప్టెంబర్ 2026లోనే జనాభా లెక్కలు మొదలవుతాయి.

Read Also- Lionel Messi Statue: 40 రోజుల శ్రమ.. 70 అడుగుల విగ్రహం.. మెస్సీ కోసం సర్‌ప్రైజ్ రెడీ!

30 లక్షల మంది సిబ్బంది

భారీ స్థాయిలో జరగనున్న జనగణను ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారుగా 30 లక్షల మంది క్షేత్ర స్థాయిలో ఎన్యూమరేటర్లు (enumerators), పర్యవేక్షకులు, మాస్టర్ ట్రైనర్లు, చార్జ్ అధికారులు, జిల్లా జనగణన అధికారులు పాలుపంచుకోనున్నారు. ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేసుకున్న ప్రభుత్వ టీచర్లు ఎన్యూమరేటర్లుగా ఉంటారు. ఆ ఉపాధ్యాయులు టీచర్ బాధ్యతలతో పాటు జనగణన విధులను నిర్వహిస్తారు. జనగణన చేపట్టినందుకుగానూ తగిన గౌరవ వేతనం చెలిస్తారు. పర్యవేక్షణ, సమన్వయం కోసం సబ్ డిస్ట్రిక్ట్, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో అదనపు జనగణన సిబ్బందిని కూడా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. జనగణన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరులు స్వీయ-గణన (self-enumeration) చేసుకునే అవకాశాన్ని కూడా కేంద్రం కల్పించనుంది. కాగా, జనగణన చేపట్టేందుకు 2025 ఏప్రిల్ 30న రాజకీయ వ్యవహారాల కేబినెట్ తీసుకున్న నిర్ణయింది. తొలిసారి జనభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో సామాజిక, జనాభా వైవిధ్యాన్ని జనాభా లెక్కింపు దశలో సమగ్రంగా గుర్తించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Just In

01

Prof Kodandaram: విత్తన ధృవీకరణ జరిగితేనే రైతుకు నాణ్యమైన విత్తనం: ప్రొఫెసర్ కోదండరాం

SP Balasubrahmanyam: రేపే ఎస్ పి. బాల సుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ.. ముఖ్య అతిథిగా..!

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Thummala Nageswara Rao: రబీకి సరిపడా యూరియా కోసం.. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల లేఖ

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!