Happiest Country in World
జాతీయం

Happiest Country in World: ఇదెక్కడి విడ్డూరం.. మనకంటే పాక్ ప్రజలే సంతోషంగా ఉన్నారట

Happiest Country in World: ప్రస్తుత కాలంలో మనిషి జీవితం.. ఉరుకులు పరుగుల మయంగా మయంగా మారిపోయింది. ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తితో చాలా మంది తమ జీవితాలను నెట్టుకొస్తున్నారు. కష్టాల సుడిగుండలో చిక్కుకొని చిరునవ్వు అనేదే లేకుండా జీవిస్తున్నారు. మనస్ఫూర్తిగా నవ్వుకోవడాన్ని కూడా మహాభాగ్యంగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసింది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 (World Happiness Report 2025) పేరిట ఓ నివేదికను రిలీజ్ చేసింది.

టాప్ ఏ దేశమంటే?

గురువారం అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితీ.. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను రిలీజ్ చేసింది. ఆరోగ్యం, మనుషుల మధ్య విశ్వాసం, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, జీడీపీ వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఇందులో వరుసగా 8వసారి ఫిన్లాండ్.. ఆనందకరమైన దేశంగా టాప్ లో నిలిచింది. మెుత్తం పదికి గాను 7.74 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో వరుసగా డెన్మార్క్, ఐస్ లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, కోస్తా రికా, నార్వే, ఇజ్రాయిల్, లుక్సెమ్ బర్గ్, మెక్సికో దేశాలు టాప్ – 10 లో నిలిచాయి.

ఇండియా ర్యాంక్ ఎంతంటే?

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిపోర్టులో భారత్ కు చెప్పుకోతగ్గ స్థానం లభించలేదు. అయితే గతేడాది యూఎన్ రిపోర్టుతో పోలిస్తే కాస్త ర్యాంక్ మెరుగుకావడం గమనార్హం. గతేడాది సంతోషకరమైన దేశాల జాబితాలో 126 ర్యాంక్ సాధించిన భారత్.. 2025కు వచ్చేసరికి 118 ర్యాంక్ కు చేరుకుంది. యుద్ధాలు, అంతర్గత తిరుగుబాటులతో అల్లాడుతున్న ఉక్రెయిన్, ఇరాక్, ముబాంబిక్ వంటి దేశాల కంటే భారత్ సంతోషకరమైన దేశాల జాబితాలో వెనకబడి ఉండటం గమనార్హం.

Also Read: Rains In Telugu States: సమయం లేదు.. మరికొద్ది గంటల్లో జోరు వర్షాలే..

పాక్ కు మెరుగైన స్థానం

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025 రిపోర్టులో భారత్ కంటే దయాదీ దేశం పాకిస్థాన్ మెరుగైన స్థానంలో నిలిచి అందరినీ షాక్ కు గురిచేసింది. భారత్ 118వ స్థానంలో నిలిస్తే పాక్ 109 ర్యాంక్ కైవసం చేసుకుంది. అలాగే మన సరిహద్దు దేశాలైనా నేపాల్ (92), చైనా (68) మన కంటే మెరుగైన స్థితిలోనే నిలిచాయి. అయితే ఇటీవల సంక్షోభంలో కొట్టుమిట్టాడిన శ్రీలంక (133), బంగ్లాదేశ్ (134) దేశాలు భారత్ కంటే వెనకబడి ఉండటం గమనార్హం.

సంతోషంగా లేని దేశాలు ఇవే

సంతోషకరమైన దేశాలతో పాటు ఆనందంగా లేని దేశాలు సైతం ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఈ జాబితాలో అఫ్గనిస్థాన్ అగ్ర స్థానంలో నిలిచింది. తాలిబన్ల పాలనలో ఉన్న ఆ దేశం.. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణకు ఆమడ దూరం ఉన్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా అక్కడి మహిళలు తమ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయారని స్పష్టం చేశాయి. అఫ్గాన్ తర్వాత సియీర్రా లియోన్, లెబనాన్ దేశాలు.. వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆయా దేశాలు పేదరికం, సామాజిక అసంతృప్తులు, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!