Encounter In Chhattisgarh, Six Naxals Killed
జాతీయం

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, ఆరుగురు నక్సల్స్ హతం

Encounter In Chhattisgarh, Six Naxals Killed: ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ అక్కడికక్కడే హతమయ్యారు.చికుర్ బత్తీ-పుస్భాకా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళతో సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం బీజాపూర్ ప్రాంతమంతా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చికుర్ బత్తీ ప్రాంతానికి సమీపంలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాల్పేరు నది సమీపంలో పీఎల్‌జీఏ ప్లాటూన్ – 10 తిరుగుబాటు దారులతో సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా ఎలైట్ యూనిట్, సీఆర్‌పీఎఫ్‌ 229వ బెటాలియన్, డీఆర్జీ సంయుక్త బృందం ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాయని, గాలింపులో మరణించిన ఆరుగురు నక్సల్స్ మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని ఐజీ తెలిపారు.

Read Also : బెయిల్ కాదు.. జైలే

ఈ ఘటనలో హతమైన ఆరుగురు నక్సలైట్లలో ఒకరు మహిళా కేడర్ అని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నందున మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ సుందర్రాజ్ తెలిపారు.

సంఘటనా జరిగిన ప్రాంతమంతా బసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బసగూడ జిల్లా రిజర్వ్ గార్డ్, సీఆర్పీఎఫ్ 229, కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్ (కోబ్రా) బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మార్చి 23న నక్సల్స్ కంచుకోట దంతెవాడలో జరిగిన ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్) పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.శనివారం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు సంభవించిందని దంతెవాడ ఎస్పీ తెలిపారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?