Anil Ambani: వ్యాపారవేత్త అనిల్ అంబానీ కథ అడ్డం తిరిగింది. కొన్నేళ్ల క్రితం బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా చూపిన ఆయన, ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. తన వ్యాపారాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే, దర్యాప్తు సంస్థలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. ఇప్పటికే ఆయనపై ఎస్‌బీఐ ఫ్రాడ్ ముద్ర వేసి, సీబీఐని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. అంతలోనే ఈడీ ఎంటర్ అయింది. ఆయనకు సంబంధించిన కంపెనీల్లో సోదాలు జరుపుతున్నది. మనీలాండరింగ్‌కు సంబంధించి వివరాలు సేకరిస్తోంది.
ఢిల్లీ, ముంబైలో ఈడీ సోదాలు
అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనిఖీలు చేపట్టింది. ఢిల్లీ, ముంబైలోని కంపెనీలకు చెందిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా దాదాపు 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. అనిల్ అంబానీ రూ.3వేల కోట్ల రుణాలకు సంబంధించి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
ఈడీకి కీలక సమాచారం
నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన ఫిర్యాదులు, సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఆధారంగా చేసుకుని ఈడీ సోదాలకు పాల్పడుతున్నది. అనిల్ అంబానీ కంపెనీలతో సత్సంబంధాలు ఉన్న వ్యాపార్తుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. భారీ మొత్తంలో నగదు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు ఉండడంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
Read Also- BRS KTR: లోకల్ బాడీ ఎన్నికలపై గులాబీ పార్టీ నజర్!
రూ.12 వేల కోట్ల రుణాలపై..
ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. వాయిదాల పద్దతిలో బ్యాంక్ నుంచి దాదాపు రూ.12,800 కోట్ల దాకా రుణాలను పొందారు. కానీ, సకాలంలో వాటిని చెల్లించలేదు. ఈ క్రమంలోనే ఈడీ ఎంటర్ అయింది. పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీని విచారించి వివరాలు కూడా సేకరించారు అధికారులు. ఇదే క్రమలో తాజా దాడులు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే ఎస్‌బీఐ ఫ్రాడ్ ముద్ర
అనిల్ అంబానీ ఎస్‌బీఐ నుంచి రూ.2,200 కోట్ల దాకా రుణాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి వడ్డీ, ఇతర ఖర్చులు మరో రూ.800 కోట్ల దాకా అయ్యాయి. అంబానీ ఈ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఎస్‌బీఐ ఆయన్ను ఫ్రాడ్‌గా ముద్ర వేసి, 2021 జనవరి 5న సీబీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తీసుకుంది. 2023 మర్చిలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. దాని ప్రకారం ఫ్రాడ్ వర్గీకరణను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది. అయితే, తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ, అనిల్ అంబానీ సహా ఆర్ కామ్‌ను ఫ్రాండ్‌గా ఎస్‌బీఐ ప్రకటించిందని తెలిపారు.
Read Also- Shubham Gill: గిల్ పక్కదారి పట్టాడు.. అతడో విలన్.. మాజీలు ఫైర్!