BRS KTR: లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవద్దు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) అన్నారు. తెలంగాణ భవన్‌లో వికారాబాద్(Vikarabad) నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు(
BRS)
బీఆర్ఎస్(Brs) లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ (Brs) గెలిచిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న అధికారులంతా సెట్ రైట్ అవుతారన్నారు.
Also Read: Pawan Kalyan: హరిహర వీరమల్లుకు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని వెల్లడించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని క్యాడర్‌కు సూచించారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇవాళ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. మీసేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభల్లో గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు.
చేసింది చెప్పుకోలేకపోయాం!
కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలి. అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్ఎస్‌దే. వికారాబాద్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన జిల్లాను ఏర్పాటుచేసి సరిగా చెప్పుకోలేపోయాం. ఆడబిడ్డలకు రూ.300 కోట్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. కానీ, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆడబిడ్డలకు రూ.3వేల కోట్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చారు.
ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి రూ.50 వేలు బాకీ ఉన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ, రైతుబంధు 15000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తానన్న రేవంత్ ఇవాళ తప్పించుకుని తిరుగుతున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని చెప్పిన రేవంత్ పత్తాలేరు. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్‌కు పోకుండా అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరేలా ప్రతి కార్యకర్త పనిచేయాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం కోసం.. లబ్ధిదారుల నిరీక్షణ!