EC | 8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లను కెటాయించిన ఈసీ
Mlc Elections
జాతీయం

EC: 8 రాష్ట్రాలకు 17 మంది స్పెషల్ అబ్జర్వర్లను కేటాయించిన ఈసీ

EC Has Appointed Special Observers For The Lok sabha Elections: లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 8 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) 17 మంది స్పెషల్ అబ్జర్వర్లను నియమించింది. ఇందులో ఏపీకి ముగ్గురు పరిశీలకులను నియమిస్తూ మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‌‌‌‌

జనరల్ స్పెషల్ అబ్జర్వర్ గా మాజీ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా, పోలీస్ స్పెషల్ అబ్జర్వర్​గా మాజీ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్​కు బాధ్యతలను అప్పగించింది.

Read Also: ఆప్ నేతకు బెయిల్ మంజూరు.. ఎమ్మెల్సీ కవితకు దక్కేనా?

అలాగే ఎన్నికల వేళ పలు రాష్ట్రాల్లో నిఘా పెంచడంతో పాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కూడా నియమిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు ధన ప్రభావం, కండ బలం, తప్పుడు సమాచారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారిని వెల్లడించింది.

ఏడు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, యూపీ, మహారాష్ట్రతో పాటు బీహార్‌‌‌‌కు పరిశీలకులను పంపుతున్నట్లు ఈసీ తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సైతం అబ్జర్వర్ల సేవలు వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. ఏపీ, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా కోసం ప్రత్యేక వ్యయ పరిశీలకులను నియమిస్తున్నట్లు తెలిపింది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?