Foreign Cars Scam(image credit:X)
జాతీయం

Foreign Cars Scam: విదేశీ లగ్జరీ కార్ల స్కాం.. హైదరాబాద్​ వ్యాపారి అరెస్ట్​..

Foreign Cars Scam: విదేశీ లగ్జరీ కార్ల కుంభకోణంలో డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అహ్మదాబాద్​ యూనిట్​ అధికారులు హైదరాబాద్​ వ్యాపారిని అరెస్ట్​ చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 100 కోట్ల రూపాయల ఈ స్కాంలో సదరు వ్యాపారి కీలకపాత్ర వహించినట్టు సమాచారం. నిందితునికి వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు, సినీ పరిశ్రమకు చెందిన వారితో పరిచయాలు ఉన్నట్టుగా తెలిసింది.

కాగా, ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు కూడా ఈ కేసులో విచారణ జరపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కేసు వివరాలు అందించాలని డీఆర్​ఐ అధికారులకు లేఖ రాయనున్నట్టు సమాచారం.

హైదరాబాద్​, ముంబయి, అహ్మదాబాద్​, పూణె, బెంగళూరు, ఢిల్లీలోని కొందరు కార్ల వ్యాపారులు ఖరీదైన విదేశీ కార్లు ఇక్కడికి తెప్పించుకుని ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాటి విలువ తక్కువగా చూపించి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలను స్వాహా చేసినట్టు డీఆర్​ఐ అహ్మదాబాద్​ యూనిట్​ అధికారులకు సమాచారం అందింది.

Also read: Naa Anveshana: అమ్మాయితో నా అన్వేష్.. ఆటగాడు మళ్లీ రెచ్చిపోయాడు..

హమ్మర్​ ఈవీ, క్యాడిలాక్​, ఎస్కలేడ్​, రోల్స్​ రాయిస్​, లెక్సస్​, టొయోటా ల్యాండ్​ క్రూయిజర్​, లింకన్​ నావిగేటర్​ తదితర కార్లను అమెరికా, జపాన్​ దేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు.

అయితే, వీటిని నేరుగా మన దేశానికి తెప్పించకుండా ముందుగా దుబాయ్​ లేదా శ్రీలంకకు చేర్చేవారు. సాధారణంగా విదేశీ కార్లకు స్టీరింగ్​ ఎడమవైపు ఉంటుంది. దుబాయ్​ లేదా శ్రీలంకకు చేర్చిన తరువాత విదేశీ కార్ల స్టీరింగ్​ ను కుడివైపునకు మార్పించే వారు.

ఆ తరువాత మన దేశానికి తెప్పించుకునేవారు. ఇక్కడకు వచ్చిన తరువాత ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటి విలువను 50శాతం తక్కువ చేసి చూపించేవారు. తద్వారా వాస్తవంగా చెల్లించాల్సిన కస్టమ్స్​ డ్యూటీలో సగం మాత్రమే చెల్లించేవారు. ఇలా దేశవ్యాప్తంగా నిందితులు దాదాపు వంద కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టుగా డీఆర్​ఐ అహ్మదాబాద్ యూనిట్ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో విచారణను ముమ్మరం చేసి హైదరాబాద్​ లో కార్​ లాంజ్​ పేర షోరూం నడుపుతున్న బషారత్​ ఖాన్​ ను అరెస్ట్​ చేసి అహ్మదాబాద్ కు తరలించారు. బషారత్​ ఖాన్​ ను జరిపిన విచారణలో అతను ఒక్కడే 7 విదేశీ లగ్జరీ కార్లను తెప్పించి వాటి విలువ తక్కువ చేసి చూపించటం ద్వారా 7 కోట్ల రూపాయల కస్టమ్స్​ డ్యూటీని ఎగ్గొట్టినట్టుగా వెల్లడి కావటం గమనార్హం.

కొనుగోలుదారుల్లో..
ఇక, డీఆర్​ఐ అధికారుల దర్యాప్తులో నిందితుల నుంచి విదేశీ లగ్జరీ కార్లు కొన్నవారిలో బడా బాబులు ఉన్నట్టుగా వెల్లడైందని సమాచారం. వీరిలో సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు కొందరు పారిశ్రామిక వేత్తలు కూడా ఉన్నట్టు తెలియవచ్చింది.

Also read: Telangana Jagruti: యువతకు కవిత పిలుపు.. జూన్ 2న పోటీలు.. మ్యాటర్ ఏంటంటే!

ప్రస్తుతం దీనిపై డీఆర్​ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్​ లో బషారత్​ ఖాన్​ నుంచి కార్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వివరాలను తెలియ చేయాలంటూ ఆర్టీఏ అధికారులకు ఇప్పటికే లేఖ రాసినట్టుగా తెలిసింది. మిగతా సిటీల్లో ఈ కుంభకోణానికి పాల్పడ్డ వారి నుంచి కార్లను కొన్నవారి వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా తెలిసింది.

రంగంలోకి ఈడీ..?
కాగా, ఈ కేసులో విచారణ జరపాలని ఈడీ అధికారులు నిర్ణయించినట్టుగా సమాచారం. విదేశీ కార్ల లావాదేవీల్లో మనీ లాండరింగ్ కూడా జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తు చేయాలని నిశ్చయించుకున్న ఈడీ అధికారులు కేసు వివరాలను తెలియ చేయాలంటూ డీఆర్​ఐ అధికారులకు లేఖ రాసినట్టుగా సమాచారం.

 

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు