Naa Anveshana: నా అన్వేషణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్ గా ఉన్న నా అన్వేష్ మళ్లీ కొత్త అమ్మాయిని వెంట పెట్టుకుని కొత్త వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Ram Pothineni: పవన్ ఫ్యాన్స్ బాటలో రామ్ పోతినేని.. పిఠాపురం సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
” ఈజిప్ట్ అంటే సవక సవక .. ఇప్పుడు మనం సవక ప్రదేశానికి వెళ్తున్నాం.. ఇక్కడ చాలా ఈజీగా ట్రావెల్ చేయోచ్చు. ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి సులభంగా వెళ్ళొచ్చని చెప్పాడు. రూ. 20 నుంచి రూ. 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ అంతా చీపు చీపు పాట పాడుతూ చెబుతున్నాడు. ఇంకా ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా ఉండదు. టూ హాట్ .. చాలా వేడిగా ఉంటుందని చెప్పాడు. 15 వేల రేటింగ్ తో ఉన్న ఈ గాడ్ రెస్టారెంట్ కి వెళ్లి ఏదోక ఫేమస్ ఫుడ్ తినాలంటూ ” ఈజిప్ట్ ను మొత్తం వీడియోలో చూపించేశాడు.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
అతను ఇంకా మాట్లాడుతూ ” ఫేమస్ అయిన రెస్టారెంట్ లో ఖరీదైన ఫుడ్ వచ్చేసింది. అది కూడా తక్కువ ధరలోనే అంటూ అతని తినే ఫుడ్ ఐటెమ్స్ గురించి చెబుతూ.. చికెన్ రొట్టె పిజ్జా , పూరీలు, నువ్వులు పూరీలు, బీన్స్ తో తయారు చేసిన పప్పు ముద్ద , వంకాయ బంగాళా దుంప బటానీ మిక్స్ కర్రీ, అన్ని రకాల సలాడ్స్, నువ్వుల గారే ” అంటూ అక్కడ ఉండే ఐటెమ్స్ అన్వేష్ ఫ్యాన్స్ కు చూపించాడు.
Also Read: Monalisa: గుడ్ న్యూస్.. అతనితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్న కుంభమేళ మోనాలిసా
అన్ని ఐటెమ్స్ తినేశాక అద్భుతంగా ఉందంటూ.. అక్కడ ఫుడ్ ను తెగ పొగిడేశాడు. తనతో పాటు ఉన్న అమ్మాయిని ఫుడ్ ఎలా ఉందని అడిగితే చాలా బావుందని తెలుగులో చెప్పడంతో అన్వేష్ కూడా షాక్ అయ్యి కదా .. సూపర్ అని అన్నాడు. బిల్ ఎంత వచ్చిందో తెలుసా అని చెబుతూ ఈజిప్ట్ కరెన్సీ లో 200 ఫౌండ్లు. అంటే రూ. 500 రూపాయలకే అంత ఫుడ్ తిన్నామని చెప్పాడు.