Range Rover at low cost: దేశ రాజధాని ఢిల్లీలో వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించే విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2025 జులై 1 నుంచి 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల కంటే పాతవైన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ రూల్స్ అమల్లోకి రావడంతో పలువురు ఢిల్లీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను తక్కువ ధరలకే అమ్మేయాల్సిన పరిస్థితి తలెత్తినట్లు ఓ వ్యక్తి వాపోయారు. కొత్త రూల్స్ పై అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు తావిస్తున్నాయి.
ఢిల్లీ పౌరుడి ఆవేదన
ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన రూల్స్ పై రితేష్ గండోత్రా అనే వ్యక్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తన రేంజ్ రోవర్ ను తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని వాపోయారు. నిజాయతీ పరులైన పన్ను చెల్లించే పౌరులకు ఈ నిబంధనలు శరాఘాతంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తన ఆవేదనను తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు. తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్ యూవీ (Land Rover Range Rove) వాహన ఫొటోను సైతం అందులో పంచుకున్నారు.
My car is in its 8th year — a diesel vehicle, meticulously maintained, just 74,000 km on the odo. It spent two years parked during Covid and easily has over 2 lakh km of life left.
But thanks to the 10-year diesel ban in NCR, I’m now forced to sell it — and that too to buyers… pic.twitter.com/uMO2LnG03q— Ritesh G (@Ritesh_Gandotra) July 1, 2025
కొత్త కారు కొనడమూ కష్టమే
తన రేంజ్ రోవర్ కారు 74,000 కి.మీ మాత్రమే ప్రయాణించినట్లు రితేష్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. కారు కొని ప్రస్తుతం 8 ఏళ్లు అవుతోందని చెప్పారు. అయితే కరోనా కారణంగా కారు.. రెండేళ్ల పార్కింగ్ స్థలంలోనే గడిపినట్లు చెప్పారు. 2 లక్షల కిలోమీటర్లు తిరగగల సామర్థ్యం ఉన్నప్పటికీ కొత్త రూల్స్ కారణంగా తక్కువే ధరకే కారును ఇచ్చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. కొత్త నిబంధనలపై ఢిల్లీ సర్కార్ పునః సమీక్ష చేయాల్సిన అవసరముందని ఆయన వాపోయారు. అంతేకాదు 45% GST + సెస్ ఛార్జీల కారణంగా కొత్త కారు కొనడం ఎంత కష్టంగా మారిందోనన్న విషయాన్ని ప్రస్తావించారు.
Also Read: Bengaluru Reddit: సోషల్ మీడియా పవర్.. 20 ఏళ్ల తర్వాత తండ్రిని కనుగొన్న కూతురు!
నెటిజన్ల మద్దతు
రితేష్ గండోత్రా పోస్టుకు ఢిల్లీకి చెందిన పలువురు నెటిజన్లు మద్దతిస్తున్నారు. ఆయన సరిగ్గా చెప్పారంటూ సపోర్ట్ చేస్తున్నారు. ‘నెలకు రూ.25 వేల కంటే తక్కువ సంపాదించే 90% మంది జనాభా ఉన్న ఈ దేశంలో.. ప్రతీ 10-15 సంవత్సరాలకు కార్లను అమ్మమని బలవంతం చేయడం నేరం తప్ప మరొకటి కాదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రభుత్వం కొత్త రూల్స్ వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు జరుగుతుందో తెలియదు కానీ.. కార్ల కంపెనీలకు మాత్రం మంచి ఆదాయం లభిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.