TN-Politics
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Political Controversy: ‘ఉచిత భార్య’ హామీ.. రాజకీయ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు

Political Controversy: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సమయం దగ్గరపడుతుండడంతో అక్కడి రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే పొత్తులపై ఒక స్పష్టమైన క్లారిటీ కూడా వచ్చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కిందస్థాయి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ఏఐఏడీఎంకే బూత్ కమిటీ శిక్షణ సమావేశంలో తమిళనాడు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం మాట్లాడుతూ, మహిళల పట్ల వివాదాస్పద (Political Controversy) వ్యాఖ్యలు చేశారు.

ఉచితంగా భార్యను కూడా ఇస్తారేమో!

సీవీ షణ్ముగం మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో ప్రకటనలు వస్తుంటాయని, మిక్సీలు, గ్రైండర్లు, మేకలు, ఆవులు ఉచితంగా ఇస్తారంటూ అధికార డీఎంకే పార్టీపై ఆరోపణలు గుప్పించారు. అక్కడితో ఆగకుండా, ‘మగాళ్లకు ఉచితంగా భార్యను కూడా ఇస్తారేమో!’ అంటూ అనుచిత   వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్… కరుణానిధి కొడుకు కాబట్టి ఈ తరహా వాగ్దానాలు చేయగలరంటూ ఆయన చమత్కరించారు. నిజానికి, సీవీ శణ్ముగం వ్యంగ్యంగానే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ తీవ్ర దుమారం చెలరేగింది. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే పార్టీ సీనియర్ నేత, మంత్రి గీతా జీవన్ స్పందిస్తూ, షణ్ముగం వ్యాఖ్యలు మహిళలను చులకన చేసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఏఐఏడీఎంకే పార్టీకి ఉన్న దుర్బుద్ధి, వికృత ఆలోచనలను షణ్ముగం వ్యాఖ్యలు బయటపెట్టాయని ఆమె వ్యాఖ్యానించారు.

Read Also- Google AI Hub: ఖరారు చేసిన మోదీ-పిచాయ్.. ఏపీకి భారీ ప్రాజెక్ట్.. ఆనందంతో కళకళ్లాడిన సీఎం చంద్రబాబు!

మహిళా జెండర్‌ను అపహాస్యం చేస్తే తమరికి కలిగే ఉపయోగం ఏమిటని షణ్ముగాన్ని ఆమె ప్రశ్నించారు. మాజీ ముఖ్యంత్రి జయలలిత బతికివుంటే ఇలాంటి మాటలు అనగలరా? అని ఆమె నిలదీశారు. షణ్ముగం చేసిన వ్యాఖ్యలు పళనిస్వామి ఏమాత్రం నిరుత్సాహపరిచి ఉండవని ఆమె విమర్శించారు. ఇదివరకు కూడా ఏఐఏడీఎంకే నేతలు మహిళలు, మహిళా పథకాలను చులకన చేస్తూ మాట్లాడిన సందర్భాలను ఆమె ప్రస్తావించారు. ‘విడియల్ పయణం’ బస్సులు లిప్‌స్టిక్ బస్సుల్లా ఉన్నాయంటూ పళనిస్వామి వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. పథకాల ద్వారా మహిళలకు ఇచ్చే డబ్బు భిక్ష లాంటిదంటూ ఖుస్భూ అన్నారని గీతా జీవన్ గుర్తుచేశారు. ఇక, మరోనేత సౌమ్య అంబుమణి మాట్లాడుతూ, మహిళలకు ఇచ్చే రూ.1,000 సాయం ఎందుకు? అంటూ ఎద్దేవా చేశారని ప్రస్తావించారు.

Read Also- EPFO New Rules: ఈపీఎఫ్‌వో అదిరిపోయే గుడ్‌న్యూస్! ఉద్యోగులు ఫుల్‌హ్యాపీ!

మహిళల సాధికారత కోసం డీఎంకే ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా మంత్రి గీతా జీవన్ ప్రస్తావించారు. విడియల్ పయణం, కలైగర్ ఉమెన్స్ రైట్స్ స్కీమ్, పుదుమై పెన్న్ స్కీమ్, తొజి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, మహిళా స్వయంసహాయక సంఘాల కోసం లోన్ పరిమితుల పెంపు వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్టు ఆమె వివరించారు. అంతేకాదు, మహిళా ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తూ అనేక పథకాలు చేపడుతున్నట్టు గీతా జీవన్ వివరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సారధ్యంలోని తమిళనాడులో మహిళల ఆర్థిక స్వావలంబన, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు గణనీయంగా పెరిగాయని ఆమె ప్రశంసించారు. ఈ అభివృద్ధిని ఓర్వలేకనే షణ్ముగం ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!