Google-AI-Hub
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Google AI Hub: ఖరారు చేసిన మోదీ-పిచాయ్.. ఏపీకి భారీ ప్రాజెక్ట్.. ఆనందంతో కళకళ్లాడిన సీఎం చంద్రబాబు!

Google AI Hub: రాష్ట్ర విభజన తర్వాత గ్లోబల్ కంపెనీలు, తద్వారా వచ్చే పెట్టుబడుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు నూతన ఉత్తేజాన్ని కలిగించే శుభపరిణామం ఒకటి మంగళవారం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి సూచీగా నిలవనున్న చారిత్రాత్మక ప్రాజెక్టు విశాఖపట్నం నగరానికి వచ్చింది. గూగుల్ కంపెనీ భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ హబ్‌ను (Google AI Hub) వైజాగ్‌లో ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం కీలకమైన ప్రకటనలు వెలువడ్డాయి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోదీతో తమ ఆలోచనలను పంచుకున్నామని, ఇది కీలకమైన పురోగతి అని గూగుల్, ఆల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఈ హబ్‌లో గిగావాట్-స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, ఒక సరికొత్త ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే, భారీ పరిమాణంలో ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా టెక్ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి సాంకేతికతను భారతదేశంలోని కంపెనీలు, యూజర్లకు అందించాలనుకుంటున్నట్టు పిచాయ్ వివరించారు.

గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా ఇండియాలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పలువురు కేంద్రమంత్రులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల సహకారంతో, అమెరికా వెలుపల అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రానున్న  ఐదేళ్లలో విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ 15 బిలియన్ బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని అన్నారు. అంటే, భారతీయ కరెన్సీలో రూ.1.25 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రకటన సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆనందంగా కనిపించారు. ఆయన ముఖం చిరునవ్వుతో మెరిసిపోయింది.

Read Also- BV Raghavulu: విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ చేసేందుకు బీజేపీ కుట్ర.. సీపీఐ నేత బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు

ఏమిటీ ప్రాజెక్ట్?

అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోతున్న అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఇది. దీనిని నిర్మించడానికి ఏకంగా లక్షా 25 వేల కోట్ల రూపాయలు అవసరం అవబోతున్నాయంటే, ఆ ప్రాజెక్ట్ ఎంత విలువైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో గూగుల్‌తో పాటు అదానీకనెక్స్ (AdaniConneX), ఎయిర్‌టెల్ కూడా భాగస్వాములుగా భాగమవుతాయి. ఈ హబ్ గిగావాట్-స్థాయి డేటా సెంటర్ క్యాంప్‌గా ఉంటుంది కాబట్టి, అతి భారీ మెషినరీ అవసరం అవుతుంది. ఎనర్జీ (power), కనెక్టివిటీ సదుపాయాలు కూడా భారీగా అవసరం అవుతాయి. ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ సబ్‌సీ (సముద్ర గర్భంలో) కేబుళ్లను ల్యాండ్ చేయడానికి ఒక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌ను (Cable Landing Station) నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఫైబర్-ఆప్టిక్స్ టెక్నాలజీ ద్వారా దేశీయ, అంతర్జాతీయ డేటా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎనర్జీ (కరెంట్) నిర్వహణ కోసం క్లీన్ లేదా రెన్యూబుల్ ఎనర్జీ వనరులను మాత్రమే ఉపయోగిస్తారు. ఇందుకు అనుగుణంగా ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటారు.

ఉయోగాలు ఏమిటి?

ఈ హబ్ ఏర్పాటు చేయడానికి పలు కీలకమైన కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఏఐకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సెంటర్ ఏర్పడితే మన దేశంలో డేటా సెంటర్, కంప్యూటేషన్ సామర్థ్యాలు పెరుగుతాయి కాబట్టిచ ఏఐకి సంబంధించిన మెషిన్ లెర్నింగ్, లార్జ్ మోడల్స్, కంప్యూట్ పవర్ వంటి సేవలు మరింత చేరువవుతాయి. అంతేకాదు, దేశీయ, అంతర్జాతీయ ట్రాఫిక్ కోసం సముద్ర గర్భంలో సబ్‌సీ కేబుళ్లు ఏర్పాటు చేస్తారు కాబట్టి, డేటా ట్రావెల్ డిస్టెన్స్ (ప్రయాణ దూరం) తగ్గిపోయి సేవలు మరింత వేగంగా అందుతాయి. అందుకే, వెయిటింగ్ సమయం తగ్గి, కనెక్టివిటీ పెరుగుతుంది. ఔటేజ్ (డౌన్ టైమ్) సందర్భాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

దేశీయంగా ఏఐ ప్రొడక్టులు, సేవలు మరింత మెరుగుపడతాయి. భారతీయ వ్యాపారులు, స్టార్టప్స్‌ తమ ఏఐ అప్లికేషన్లు, సేవలు సిద్ధం చేసుకోవడానికి అవసరమైన కంప్యూటింగ్, మౌలిక సేవలు దగ్గరగా ఉంటాయి. ఫలితంగా కంపెనీల ఖర్చులు, సమయం, నెట్‌వర్క్ సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయి. డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడి, దేశంలోని అన్ని ఇతర ప్రాంతాలకూ, సాధారణ ప్రజలకు కూడా ఏఐ సేవలు మరింత చేరువ అవుతాయి. ఆర్థిక అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ఆవిష్కరణలు పెరుగుతాయి. భారీ పెట్టుబడు రానుండడంతో స్థానిక ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఏఐ, సాంకేతిక పరిశోధనలో భాగస్వామ్యం పెరిగి చక్కటి ప్రయోజనాలు కలిగిస్తాయి.

భారీఎత్తున ఉద్యోగ కల్పన జరుగుతుంది. డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, నెట్‌వర్క్, ఎనర్జీ నిర్వహణ వంటి విభాగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయి. స్టార్టప్స్, పరిశ్రమలకు అవసరమైన కంప్యూటర్ పవర్, ఏఐ మోడల్స్, డేటా సర్వీసుల రూపంలో మరిన్ని నూతన ప్రాజెక్టులు కూడా వస్తాయి. తద్వారా ఆవిష్కరణల కార్యకలాపాలు తక్కువ ఖర్చుతో పూర్తవుతాయి. ప్రభుత్వాలు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.

Read Also- EPFO New Rules: ఈపీఎఫ్‌వో అదిరిపోయే గుడ్‌న్యూస్! ఉద్యోగులు ఫుల్‌హ్యాపీ!

ఎప్పటికి పూర్తవుతుంది?

గూగుల్ కంపెనీ వివరాల ప్రకారం, ఈ ఏఐ హబ్ నిర్మాణానికి 5 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. 2026–2030 ఈ నిర్మాణం జరుగుతుంది. మూడవ దశలో పెట్టుబడులను వినియోగించబోతున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, 2026లో నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయి. 2028–2032 మధ్యకాలంలో ముఖ్యమైన కార్యకలాపాలు, ఉద్యోగ, ఆర్థిక ప్రభావాలు కనిపించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

ఏపీకి ప్రయోజనాలు

రాష్ట్ర విజభన తర్వాత, ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ రంగ ఉద్యోగులు హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సి వస్తోంది. గూగుల్ ఏఐ డేటా హబ్ అందుబాటులోకి వస్తే, చాలామందికి ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు దక్కుతాయి. డేటా సెంటర్ నిర్వహణ, మౌలిక వసతులు, ఎనర్జీ (విద్యుత్) విభాగాల్లో స్థానికులకు ఉద్యోగాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇంజనీరింగ్, ఫేసిలిటీ మేనేజ్‌మెంట్, పవర్ సపోర్ట్, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి విభాగాలు ఉపాధి కల్పన జరుగుతుంది. అనేక కంపెనీలు ఈ హబ్‌ను ఉపయోగించుకుంటాయి, కాబట్టి రాష్ట్ర యువతకు పరోక్షంగా మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్థాయి. తద్వారా నిర్మాణ రంగం ఊపందుకోవడంతో పాటు రవాణా, విద్యుత్ సప్లయ్, నెట్‌వర్క్ సేవా సంస్థలు, ఈ విధంగా పలు విభాగాలు అభివృద్ధి చెందుతాయి.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?