corona
జాతీయం

Covid 19: చాపకింద నీరులా కమ్మేస్తున్న కరోనా.. లాక్‌డౌన్ తప్పదా?

Covid 19: కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4 వేరియంట్లు ఇండియా(India)లో యాక్టివ్ అయ్యాయి. కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. రానున్నది వానాకాలం. కరోనా విజృంభణ ఖాయం. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. పైగా విష జ్వరాలు విరుచుకుపడే కాలం కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఈ 4 వేరియంట్లే..

దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాలుగు కొత్త కొవిడ్ 19 వేరియంట్లు యాక్టివ్‌లో ఉన్నాయని ప్రకటించారు. ఎల్ఎఫ్.7, ఎక్స్ఎఫ్‌జీ, జేఎన్.1, ఎన్బీ.1.8.1 వేరియంట్ల కేసులు పెరుగుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో సేకరించిన నమూనాల్లో ఈ వేరియంట్లు బయటపడ్డాయి.

Read Also- Actress Abhirami: నాకు నచ్చే కమల్ హాసన్ తో అలాంటి సీన్స్ చేశా.. నటి సంచలన కామెంట్స్

3వేల 700 దాటిన యాక్టివ్ కేసులు

కరోనా యాక్టివ్ కేసుల్లో కేరళ టాప్ ప్లేస్‌లో ఉన్నది. అక్కడ కేసుల సంఖ్య 14 వందలకు చేరుకున్నది. రెండోస్థానంలో మహారాష్ట్ర కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలోనూ అనూహ్యంగా కేసులు పెరిగాయి. అక్కడ 436 మంది కరోనా బారినపడ్డారు. దేశంలోని యాక్టివ్ కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 70 శాతానికి పైగా కేసులు ఉన్నాయి. మరోవైపు, మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నది.

యాక్టివ్ కేసుల వివరాలు(రాష్ట్రాల వారీగా)

కేరళ – 1400
మహారాష్ట్ర – 485
ఢిల్లీ – 436
గుజరాత్ – 320
పశ్చిమ బెంగాల్ – 287
కర్ణాటక – 238
తమిళనాడు – 199
ఉత్తరప్రదేశ్ – 149
రాజస్థాన్ – 62
పుదిచ్చేరి – 45
హర్యానా – 30
ఆంధ్రప్రదేశ్ – 23
మధ్యప్రదేశ్ – 19
గోవా – 10
ఒడిశా – 9
జమ్ము కశ్మీర్ – 6
జార్ఖండ్ – 6
ఛత్తీస్‌గఢ్ – 6
పంజాబ్ – 6
అసోం – 5
అరుణాచల్ ప్రదేశ్ – 3
సిక్కిం – 3
తెలంగాణ – 3
ఉత్తరాఖండ్ – 3
బిహార్ – 2
మిజోరం – 2
ఛండీగఢ్ – 1

గత 24 గంటల్లో పెరిగిన కేసులు

గత 24 గంటల్లో కరోనా లెక్కలు చూస్తే, పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా కేసులు పెరిగాయి. అక్కడ కొత్తగా 82 మంది కరోనా బారినపడ్డారు. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 287కు చేరుకున్నది. ఆ తర్వాత, కేరళ, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేరళలో కొత్తగా 64 కేసులు నమోదవ్వగా, ఢిల్లీలో 61, గుజరాత్‌లో 55 మంది వైరస్ బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో కొత్తగా 32, మహారాష్ట్రలో 18, తమిళనాడులో 14, ఏపీలో 6, అసోంలో 3, గోవాలో 2, హర్యానాలో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, ఒడిశాలో 2, పుదుచ్చేరిలో 4, పంజాబ్‌లో ఒకటి, రాజస్థాన్‌లో 2, ఉత్తరాఖండ్‌లో ఒకటి, సిక్కింలో 3 కేసులు నమోదయ్యాయి.

Read Also- ITDA: ఐటీడీఏల్లో పడకేసిన వైద్యం.. విద్యదీ అదే దారి!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు