Telangana ITDA
సూపర్ ఎక్స్‌క్లూజివ్

ITDA: ఐటీడీఏల్లో పడకేసిన వైద్యం.. విద్యదీ అదే దారి!

  • అందుబాటులో లేని డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ
  • డెలివరీలు చేయాలంటే డోలీ కట్టాల్సిందే
  • ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యం కోసం అలమటిస్తున్న ఆదివాసీలు
  • బెస్ట్ అవైలబుల్ స్కీం కింద వెళ్లిన విద్యార్థులకు ఫీజుల కరువు
  • మండల కేంద్రాల్లోని ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్న వైనం

ITDA: రాష్ట్రంలో ఉన్న మన్ననూరు, ఉట్నూరు, భద్రాచలం, ఏటూర్ నాగారం ఐటీడీఏల్లోని పరిస్థితులపై ‘స్వేచ్ఛ’ (Swetcha) వరుస కథనాలు ఇస్తున్నది. ఇప్పటికే అధికారులు లేమితో ఎదురవుతున్న సమస్యలపై కథనం ప్రచురించగా సంచలనమైంది. గిరిజనుల (Tribal) బతుకు మార్చేందుకు ఏర్పాటై ఐటీడీఏల్లో విద్య, వైద్యం (Health) పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కురిసే వర్షాలకు రహదారులు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిలవడంతో ఆదివాసీలు రోగాల బారిన పడుతున్నారు. ఐటీడీఏలు ఏర్పాటు అయి చాలా కాలం అవుతున్నా ఆదివాసీలకు అంతంత మాత్రంగానే విద్య, వైద్యం అందుతున్నాయి.


అధికారుల్లో నిర్లక్ష్యం.. పాలకులదీ అదే తీరు

ఐటీడీఏ పాలక మండలి సమావేశాలు పూర్తిగా నిర్వహించకపోవడంతో అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. ఆ నిర్లక్ష్యం వల్ల ఆదివాసీలు వానాకాలంలో వివిధ రకాల జబ్బులకు లోనవుతున్నారు. వీటన్నింటినీ అధిగమించి గిరిజనులకు అండగా ఉండి వారి బాగోగులు చూడాల్సిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ఆ దిశగా ఆలోచించడం లేదు. వసతులను సైతం మరిచిపోవడం ఆనవాయితీగా కొనసాగుతున్నది.


అడ్రస్ లేని అధికారులు

రాష్ట్రంలోని 4 ఐటీడీఏ కార్యాలయాల పరిధిలో ఆదివాసీలకు జబ్బులు వస్తే క్షేత్రస్థాయిలో సందర్శించి వైద్యం చేయాల్సిన డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ అందుబాటులో లేకుండా పోయారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలతో బిక్కుబిక్కుమంటూ జనం గడుపుతుంటారు. ఏదైనా జబ్బు చేస్తే జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు వెళ్లే రవాణా సౌకర్యాలు సైతం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also- BRS Vs Jagruthi: ‘జాగృతి’ సైన్యం సిద్ధం.. బీఆర్ఎస్‌కు ఇక కష్టకాలమేనా?

గర్భిణీలకు ప్రసవం చేయాలంటే డోలీ దిక్కు

గిరిజన గ్రామాల్లో గర్భిణీలకు ప్రసవం చేయాలంటే ఏకైక మార్గం డోలీ కట్టాల్సిన పరిస్థితి. వృద్ధులు, చిన్నపిల్లలకు వైద్యం అందించాలంటే రవాణా భారం పెరిగిపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఐటీడీఏ కార్యాలయాల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

విద్యార్థులకు ఫీజుల కరువు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు కరువవుతున్నాయి. దీంతో వారంతా సంబంధిత మండలాలకు చేరుకొని అక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ఇలా వచ్చిన ములుగు జిల్లా కేంద్రంలోని గ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌లో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి చదివే విద్యార్థులు చిరుతపల్లి గ్రామానికి చెందిన కారం హిందూ, కారం లోహిత, చేల హర్షిత, భవ్యశ్రీ, అర్పిత నల్లబోయిన శ్రీధర్, అదేవిధంగా ఎదులాపురం స్కూల్‌లో కాక హర్షిని చదువుతున్నారు. అదేవిధంగా మన్ననూరు, ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలోనూ ఇలాంటి విద్యార్థులు పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తున్నది.

అధికారులతో మంత్రి సమీక్ష

మంత్రి సీతక్క ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఐటీడీఏ ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో ట్రైబల్ మ్యూజియం, విద్యార్థులకు లైబ్రరీ రీడింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో టాప్ ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ గిరిజన వికాసాన్ని విజయవంతం చేసి చూపించాలని వివరించారు. పాఠశాలలు తెరుచుకునే లోపు వాటి మరమ్మతులను పూర్తి చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో వాగులు, వంకల మీద బ్రిడ్జిలను నిర్మించే కార్యాచరణను సిద్ధం చేయాలని చెప్పారు. ఆదివాసీ గిరిజన పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని అధికారులకు సూచనలు చేశారు. మేడారం జాతర కోసం అవసరమైన రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించాలన్నారు.

Read Also- Squid Game 3 Trailer: ప్రాణాలతో చెలగాటం.. ‘స్క్విడ్‌ గేమ్ 3’ ట్రైలర్ చూశారా?

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు