Squid Game 3 Trailer: ‘స్క్విడ్ గేమ్’ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు రెండు సీజన్స్ వచ్చాయి. 2021 లో రిలీజ్ అయిన మొదటి సీజన్ భారీ హిట్ (Hit) అయ్యింది. తర్వాత సీక్వెల్స్ కూడా ప్లాన్ చేశారు. ఇది చూడడానికి భయంకరంగా ఉన్నా, ప్రేక్షకులు మాత్రం ఒక్క ఎపిసోడ్ (Episode) కూడా మిస్ కాకుండా చూశారు. డిసెంబర్ (December) 26న సిరీస్ 2 రిలీజ్ కాగా ఆడియెన్స్‌ను ఓ మోస్తరుగా మెప్పించింది.
రెండు సిరీస్‌లకు భారీ క్రేజ్
‘స్క్విడ్ గేమ్’ సీజన్స్ కు లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఈ సిరీస్ నెట్టింట బాగా ట్రెండింగ్ అయింది. డబ్బు కోసం ఒక మనిషిని జాలి, దయ లేకుండా చంపే ఈ ఆటను ఈ సిరీస్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ కు భారీ క్రేజ్ వచ్చింది. మొదటి సీజన్‌కు సినీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్‌ను కూడా మన ముందుకు తీసుకొచ్చారు.
డబ్బు, చావు మధ్య పోరాటం
మనిషి సగటు ఆలోచనా విధానాన్ని మొదటి సిరీస్‌లో దర్శకుడు ఎంతో చక్కగా ఆవిష్కరించాడు. మనిషికీ డబ్బుకీ ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆద్యంతం అత్యద్భుతంగా తెరకెక్కించాడు. డబ్బు కోసం మనిషితో ఆడే నెత్తుటి ఆటను ఇంట్రెస్టింగ్‌గా తీశాడు. మొదటి భాగాన్ని కొనసాగిస్తూ, రెండో సిరీస్ వచ్చింది. మనుషులను ఆటలోకి దింపే ఫ్రంట్ మ్యాన్‌ను కనిపెట్టడంతో రెండో సిరీస్ ప్రారంభమవుతుంది. హీరో లీ జంగ్ అతడి కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టి వెతుకుతుంటాడు. ఇంకోవైపు తొలి భాగంలో సోల్జర్‌లా వెళ్లి గాయపడిన పోలీస్ తిరిగి కోలుకుని డిటెక్టివ్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో లీ జంగ్‌ను కలుస్తాడు. ఇద్దరూ కలిసి గేమ్ ఆడే ప్రాంతాన్ని కనిపెట్టాలనుకుంటారు. లీ మరోసారి ఆడేందుకు వెళ్లగా, పోలీస్ దీవి వేటలో ఉంటాడు. తొలి భాగంతో పోలిస్తే, అసభ్య సన్నివేశాలు, బూతు పదాలు రెండో భాగంలో తక్కువే. కానీ, రక్తపాతం ఎక్కువగా చూపించారు. ఇప్పుడు మూడో భాగం సిద్ధమవుతున్నది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
స్క్విడ్ గేమ్ 3 ట్రైలర్
ప్రేక్షకులు సెకండ్ సిరీస్‌ను చూడడానికి ఎంతో ఆసక్తి చూపించారు. దానికి బాగా క్రేజ్ రావడంతో ఇప్పుడు మూడో సీజన్‌ను కూడా ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. హ్వాంగ్ డాంగ్ హ్యుక్ డైరక్షన్‌లో తెరకెక్కిన ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ సిరీస్‌కు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. మీరూ ఓ లుక్కేయండి.