Covid-19 cases India: దేశంలో కరోనా భయాందోనలు మళ్లీ మెుదలయ్యాయి. యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన తాజా కరోనా గణాంకాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 దాటింది. దాదాపు మూడేళ్ల తర్వాత కరోనా కేసులు వెయ్యి మార్క్ అందుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఆ రాష్ట్రంలోనే అత్యధికం
ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,010కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో 74 శాతం కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది. ఒక్క కేరళలోనే ప్రస్తుతం 40% యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 400 మందికి పైగా బాధితులు ఆ రాష్ట్రంలో ఉన్నట్లు చెప్పింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (210 కేసులు), ఢిల్లీ (104 కేసులు) ఉన్నట్లు వివరించింది. పంజాబ్ లో సోమవారం తొలి కేసును గుర్తించినట్లు తెలిపింది.
మిగిలిన రాష్ట్రాల్లో కేసులు
ఇతర రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు విషయానికి వస్తే.. కర్ణాటకలో ప్రస్తుతం 47 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గుజరాత్ లో 83 కేసులు, కర్ణాటకలో 47 మంది, ఉత్తరప్రదేశ్‌లో 15 మంది, బెంగాల్‌లో 12 మంది, తమిళనాడులో 69 మంది, రాజస్థాన్‌లో 13 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకూ దేశంలో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అందులో 3 మరణాలు మహారాష్ట్రలో సంభవించగా రెండు కేరళ, ఒకటి కర్ణాటకలో నమోదైనట్లు తెలిపింది.
Also Read: TDP Mahanadu 2025: నోరూరిస్తున్న మహానాడు మెనూ.. తెలుగు తమ్ముళ్లకు పండగే!
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జిల్లాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్లో ఏలూరుకు చెందిన భార్య భర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. అయితే వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో ఒక యాక్టివ్ కేసు ఉంది. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.