TDP Mahanadu 2025: కడప వేదికగా టీడీపీ మహనాడు ప్రారంభమైంది. 3 రోజులపాటు సాగే మహానాడు కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల ఉన్న టీడీపీ కార్యకర్తలు తరలివస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తల కోసం అద్భుతమైన వంటకాలను టీడీపీ సిద్ధం చేస్తోంది. ఆహారం విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పసందైన మెనూను సిద్ధం చేసింది. వాస్తవానికి మహానాడు ఎప్పుడూ జరిగినా వంటకాలు హైలెట్ గా నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈసారి మెనూ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
ఆంధ్రా, తెలంగాణ స్టైల్లో..
ఈసారి మహానాడులో మూడు ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధ వంటకాలను టీడీపీ శ్రేణులను అందించనున్నారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత మహానాడులో మాంసాహారం సైతం వడ్డించనున్నడం విశేషం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. మూడు రోజులు కలిపి 5 లక్షల మందికి పైగా మహానాడుకు హాజరయ్యే అవకాశముంది.
1,700 మంది వంటవారు
ప్రతీ రోజూ 20 రకాల వంటకాలకు తగ్గకుండా మెను ఉండేలా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. ఫుడ్ తయారీ కోసం ఏకంగా 1700 మంది వంటవారిని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ శ్రేణులకు వడ్డించడానికి మరో 800 మందిని సిద్ధం చేశారు. తాపేశ్వరం కాజా, అల్లూరయ్య మైసూర్‌పాక్ (ఒంగోలు), చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా వంటి స్వీట్స్.. శ్రేణులను నోటిని తీపి చేయనున్నాయి.
ఉదయం టిఫిన్స్
మూడు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి ఉదయం నుంచే పార్టీ శ్రేణులు తరలిరానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం వారికి అల్పాహారం అందించనున్నారు. ఇందులో భాగంగా టూటీ ఫ్రూటీ కేసరి, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్ టిఫిన్ కింద ఇవ్వనున్నారు. వీటితో పాటు కాఫీ, టీ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
మధ్యాహ్నం మెనూ
మహానాడులో మధ్యాహ్న భోజనం హైలెట్ గా నిలవనుంది. మాంసాహారం, శాఖహారం రెండు రకాల వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి. ముందుగా మాంసాహారం విషయానికి వస్తే.. గోంగూర చికెన్, ఎగ్ రోస్ట్, ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ, ప్లెయిన్ బిర్యానీ, వైట్ రైస్, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగన్నం పెట్టనున్నారు. శాఖాహారం కింద గోంగూర పూల్ మఖానా, ప్లెయిన్ బిర్యానీ టమాటా పప్పు, తెల్లన్నం, రోటి పచ్చడి, పెరుగు, చిప్స్ ములక్కాయ టమాటా, బెండకాయ, బూందీ వడ్డించనున్నారు.
Also Read: Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. గేమ్స్ ఆడొద్దన్న తల్లి.. ప్రాణాలు తీసుకున్న బిడ్డ!
సాయంత్రం స్నాక్స్
మహానాడులో సాయంత్రం 5 గంటల తర్వాత స్నాక్స్ ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడి, మిర్చి బజ్జీలను శ్రేణులకు ఇవ్వనున్నారు. వీటితో పాటు యథావిధిగా కాఫీ, టీలు అందించి శ్రేణులను ఉత్సాహంగా ఉంచనున్నారు. ఇక రాత్రి వేళ రైస్ తో పాటు వంకాయ బఠాణీ, ఆలు ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు ఇవ్వనున్నారు.