congress manifesto paanch nyay
జాతీయం

Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీలు ఇవే

Paanch Nyay Pachees Guarantees: లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఐదు గ్యారెంటీలతో పాంచ్(ఐదు) న్యాయ్, పచ్చీస్ గ్యారంటీ పేరిట ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. ఒక్కో గ్యారెంటీ కింద ప్రత్యేకంగా ఐదు హామీలను పేర్కొన్నారు. పాంచ్ న్యాయ్‌లు.. హిస్సేదారి న్యాయ్, నారీ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్‌లుగా ఉన్నాయి. ఈ ఒక్కో న్యాయ్ కింద ఐదేసి హామీలు ఉన్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ చిత్రాలు మ్యానిఫెస్టో కు ముఖ చిత్రంగా ఉన్నది. ఇద్దరూ అభివాదం చేస్తూ ఉన్న ఫొటో అదీ. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను మల్లికార్జున్ ఖర్గే విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, చిదంబరం, పవన్ ఖేరా, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read: ఓడిపోయినా వాస్తును వదలని కేసీఆర్!.. అప్పుడు సెక్రెటేరియట్, ఇప్పుడు తెలంగాణ భవన్

ఐదు గ్యారంటీలు, వాటిలోని హామీలు ఇలా ఉన్నాయి.

కిసాన్ న్యాయ్

1. కనీస మద్దతు ధరకు న్యాయబద్ధమైన గుర్తింపు. స్వామినాథనర్ సిఫారసులకు లోబడి కనీస మద్దతు ధరను అందిస్తాం. ఆ కనసీ మద్దతు ధరకు న్యాయబద్ధమైన హామీ ఉంటుంది.
2. రైతుల రుణ మాఫీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
3. పీఎం ఫసల్ బీమాలో మార్పులు చేస్తాం. పంట నష్టానికి 30 రోజుల్లో డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తాం
4. రైతులకు లబ్ది చేకూరేలా సుస్థిర దిగుమతి, ఎగుమతి విధానాలు తెస్తాం
5. సాగు ఇన్‌పుట్ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు

యువ న్యాయ్:

1. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల హామీ
2. డిగ్రీలతో బయటకు వచ్చే విద్యార్థులకు తొలి ఉద్యోగం పక్కాగా అందిస్తాం. ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌లు ఇస్తాం. యేటా రూ. 1 లక్ష స్టైపెండ్ ఇస్తాం.
3. కఠిన చట్టాలు తెచ్చి పేపర్ లీక్‌ల నుంచి విముక్తి కల్పిస్తాం
4. గిగ్ ఎకానమీకీ అండగా నిలుస్తాం. ఫిక్స్‌డ్ పింఛన్, ఇన్సూరెన్స్‌లతోపాటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
5. ప్రతి జిల్లాలో యువ రోషిణి కింద స్టార్టప్‌లకు రూ. 5000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాం

నారీ న్యాయ్:

1. మహాలక్ష్మీ కింద ప్రతి పేద కుటుంబం నుంచి మహిళకు యేటా రూ. 1 లక్ష అందజేస్తాం
2. మహిళలు తమ న్యాయబద్ధ హక్కులను వినియోగించుకునేలా పారాలీగల్ ఏర్పాటు చేసి చైతన్యపరుస్తాం. సహకరిస్తాం
3. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం
4. ప్రతి జిల్లాకు ఒక సావిత్రిబాయి ఫూలే హాస్టల్ ఏర్పాటు చేస్తాం. తద్వార వర్కింగ్ విమెన్‌కు హాస్టల్‌ను రెండింతలు చేస్తాం
5. ఆశా, అంగన్వాడీ, ఎండీఎం వర్కర్ల ఆదాయానికి కేంద్రం నుంచి సహకారాన్ని రెట్టింపు చేస్తాం

హిస్సేదారి న్యాయ్:

1. సామాజిక సమానత్వానికి, ఆర్థిక వృద్ధికి కుల గణన చేపడతాం
2. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేస్తాం
3. ఎస్టీ ఆవాసాలు ఎక్కువగా ఉండే ఏరియాలను షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తిస్తాం
4. అటవీ హక్కు చట్టం డిమాండ్లను ఏడాదిలోగా సెటిల్ చేస్తాం
5. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కూ న్యాయబద్ధ హామీ ఇస్తాం. దామాషా ప్రకారం ఈ వర్గాలు తమ వాటాను పొందేలా ప్రత్యేక బడ్జెట్ తెస్తాం

శ్రామిక్ న్యాయ్:

1. ఆరోగ్యం హక్కుగా చట్టం తెచ్చి అందరికీ ఆరోగ్య సేవలు అందజేస్తాం
2. ‘ఉపాధి’ కార్మికులకు కనీసం వేతనం రోజుకు 400గా నిర్ణయిస్తాం. దేశమంతా అందేలా చర్యలు తీసుకుంటాం
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హమీ చట్టం
4. అసంఘటితరంగ కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా
5. ప్రభుత్వ ముఖ్యమైన శాఖల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు