LPG Price Hike: సామాన్యులకు బిగ్ షాక్..
LPG Price Hike ( Image Source: Twitter)
జాతీయం

LPG Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.111 పెంపు

LPG Price Hike: మనం రోజూ వినియోగించే నిత్యావసర ధరలు ఒక్కసారిగా పెరిగితే సామాన్యులకు భారం అవుతుంది. వాటిలో ఇక ఎల్‌పిజి సిలిండర్ ధరలు ఒకసారి పెరిగితే చెప్పాల్సిన అవసరమే లేదు అది పెరుగుతూనే ఉంటుంది. ఈ రోజే ఏడాది ప్రారంభమైంది.. 2025 కి ముగింపు చెప్పి.. 2026 కు స్వాగతం పలికారు. అయితే, అందరూ ఆ సంతోషంలో ఉన్నారు. అయితే, కేంద్రం ఉదయం షాకింగ్ న్యూస్ చెప్పింది. అదేంటో ఇక్కడ చూద్దాం..

Also Read: Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

కేంద్ర ప్రభుత్వం జనవరి 1న 19 కిలోల వాణిజ్య ఎల్‌పిజీ (కమర్షియల్ LPG) సిలిండర్ ధరను రూ.111 పెంచుతున్నట్లు ప్రకటించి, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహంపై నీళ్లు చల్లింది. ఈ ధరల పెంపు నేటి నుంచే అమల్లోకి రావడంతో హోటల్, రెస్టారెంట్, క్యాటరింగ్ సేవలు, చిన్న వ్యాపార వర్గాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.

ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా ధరల పెంచడంతో వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు వాళ్లు రోజువారీ వంటకాల్లో వాణిజ్య గ్యాస్‌పై ఆధారపడుతున్నందున, నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం వినియోగదారులపై పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు వారు మండి పడుతున్నారు.

Also Read: Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

ఈ ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 1,580.5 నుండి రూ. 1,691.5కు పెరుగుతుంది, కోల్‌కతాలో ధరలు రూ. 1,684 నుండి రూ. 1,795కు పెరుగుతాయి. ముంబైలో సిలిండర్ల ధర రూ. 1,531 నుండి రూ. 1,642.50కి చేరుకుంటుంది. అయితే, గృహ వినియోగదారులకు ఊరటనిస్తూ, 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశవ్యాప్తంగా గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ల ధర రూ. 850 నుండి రూ. 960 మధ్య స్థిరంగా ఉంది.

Also Read: Urea Black Marketing: యూరియా దందాకు తెర లేపిన ప్రైవేట్ ఫర్టిలైజర్స్.. రెట్టింపు ధరలతో అన్నదాతలు ఆగమాగం

Just In

01

Urea Monitoring: తెలంగాణలో తొమ్మిది మంది స్పెషల్ అధికారుల తనిఖీలు.. ఇక ఆ సమస్యకు చెక్..!

Air India Pilot: ఫ్లైట్ టేకాఫ్‌కు ముందు షాక్.. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో దొరికిపోయిన ఎయిర్ ఇండియా పైలట్..!

Shocking Incident: రూ.50 పందెం కోసం.. పెన్ను మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత చూస్తే..

Minor Irrigation Census: మైనర్ ఇరిగేషన్ పై కేంద్రం స్పెషల్ ఫోకస్.. బోరు బావులకు మీటర్లు?

Anasuya Post: అదే నేను.. అలాగే ఉంటాను.. స్విమ్ సూట్‌లో అనసూయ అందాల విందు