Chandrababu on OP Sindoor
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Chandrababu: ఆపరేషన్ సిందూర్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: జమ్మూ కశ్మీర్‌లోని (Jammu Kashmir) పహల్గామ్‌లో ఉగ్రవాదుల నరమేధానికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను (Operation Sindoor) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి సమర్థించారు. ఆపరేషన్ సిందూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి అని అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ మోదీ సాధించిన విజయమా? అని ప్రశ్నించగా, 100 శాతం అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి గొప్ప గర్వకారణమైనదని మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ‘గ్లోబల్ లీడర్’ అని చంద్రబాబు కొనియాడారు. జాతీయ టీవీ ఛానల్ ‘ఇండియా టుడే’ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ మేరకు మాట్లాడారు. భారత్, పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణను ఆపడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని, దీని ద్వారా ఆయన దార్శనికత నిరూపితమైందని మెచ్చుకున్నారు.

Read this- Chandrababu: వైఎస్ జగన్‌ నుంచి గుణపాఠాలు నేర్చుకున్న చంద్రబాబు.. ఐదు విషయాలివే!

ప్రధాని నరేంద్ర మోదీ మినహా మరే ఇతర నాయకుడు ఇంత పరిపూర్ణంగా వ్యవహరించలేరని చంద్రబాబు పొగిడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన దురదృష్టకరమని, భార్యల కళ్లేదుటే భర్తలను చంపివేయడం శోఛనీయమని విచారం వ్యక్తం చేశారు. 25 మంది టూరిస్టులు, ఒక స్థానిక వ్యక్తిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులపై ప్రతీకారానికి, దేశ మహిళల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సైనిక ఆపరేషన్‌కు ప్రధాని మోదీ ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టారని చంద్రబాబు గుర్తుచేశారు.

20 నిమిషాల్లోనే ఖతం
ఆపరేషన్ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా కేవలం 20 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పౌరులు, రక్షణ స్థావరాలపై దాడి చేయలేదన్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ సరైన సమయంలో ముగిసిందని, ప్రధాని మోదీయే ముగించారని వ్యాఖ్యానించారు. ‘‘ఇది మన ఘనత కాదా?. మోదీ దార్శనికత విజయం సాధించింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే నష్టపోతాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read this- Rinku Singh Engagement: పొలిటీషియన్‌తో క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చిత్తార్థం

రాహుల్ గాంధీ విమర్శలపై..

ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లొంగిపోయారంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలపై చంద్రబాబు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం మన దేశానికి లేదు’’ అని అన్నారు. ‘‘మనకు మన సొంత వ్యూహాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్‌పై ఎవరికి నియంత్రణ ఉంటుంది?. అందుకే ఆయన నచ్చినట్టు మాట్లాడుతుంటారు. ప్రధాని మోదీ జ్ఞానం విజయం సాధించింది. మనం చాలా స్పష్టంగా ఉన్నాం. అనవసరంగా భారత్ గొడవలకు పోదు. ఎవరైనా మన మీదకు వస్తే వదిలిపెట్టది ఉండదు. మన దేశాన్ని మనం రక్షించుకోగలం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

భారతదేశం ప్రతి ఒక్క దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఆశిస్తుందని, ఎక్కడి నుంచో, ఎవరి నుంచో ఎలాంటి సిఫార్సులు, మద్దతు అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నారని, అది మన దేశానికి గర్వకారణమని మెచ్చుకున్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్థాన్, పీవోకేలలోని 9 లోకేషన్లలో ఉగ్రవాద శిబిరాలను భారత సేనలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఆ తర్వాత, పాక్‌తో ఘర్షణ ఏర్పడగా, కీలకమైన ఎయిర్‌బేస్‌లపై భారత సేనలు దాడి చేసి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?