Padma Awards 2026: పద్మపురస్కారాలు ప్రకటించిన కేంద్రం
Government of India announces Padma Awards 2026 honouring Dharmendra and Rohit Sharma
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Padma Awards 2026: నట దిగ్గజం ధర్మేంద్రకు పద్మవిభూషణ్.. రోహిత్ శర్మకు పద్మశ్రీ.. పద్మపురస్కారాలు ప్రకటించిన కేంద్రం

Padma Awards 2026: పద్మ పురస్కారాలు-2026 (Padma Awards 2026) జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇటీవలే కన్నుమూసిన బాలీవుడ్ నటదిగ్గజం ధర్మేంద్రను పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. కళల రంగంలో సేవలకు ఈ పురస్కారం దక్కింది. పబ్లిక్ అఫైర్స్ కేటగిరిలో కేరళకు చెందిన కేటీ థామస్‌, మాజీ సీఎం అచ్యూతానందన్ (మరణానంతరం), కళల రంగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్.రాజం, సాహిత్యం, విద్య రంగంలో కేరళకు చెందిన పీ నారాయణం లకు కూడా పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కాయి.

మొత్తం 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యక్తులకు ఈ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, వెంపటి కుటుంబ శాస్త్రీకి సాహిత్యంలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందినవారి విషయానికి వస్తే విజయ్ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం) పద్మశ్రీ అవార్డులు వరించాయి. ఇక, కళల విభాగంలో దీపికా రెడ్డికి, సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ (ఏపీ), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్‌ (తెలంగాణ), కళల విభాగంలో మాగంటి మురళీ మోహన్‌ (ఏపీ) పురస్కారాలు దక్కాయి.

Read Also- Municipal Elections: మున్సిపాలిటీ ఎన్నికలపై గులాబీ గురి.. గెలుపుకోసం సీరియస్ స్ట్రాటజీ సిద్దం

పద్మభూషణులు వీరే..

పద్మభూషణ్ పురస్కార గ్రహీతల జాబితాను పరిశీలిస్తే, 1. అల్కా యాగ్నిక్ (కళలు-మహారాష్ట్ర), 2. భగత్ సింగ్ కోష్యారీ (ప్రజా వ్యవహారాలు-ఉత్తరాఖండ్), 3.కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి (వైద్యం-తమిళనాడు), 4.మమ్ముట్టి (కళలు-కేరళ), 5. డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (వైద్యం-అమెరికా), 6. పియూష్ పాండే (మరణానంతరం) కళలు-మహారాష్ట్ర, 7. ఎస్‌కేఎం. మైలానందన్ (సామాజిక సేవ-తమిళనాడు), 8. శతావధాని ఆర్. గణేష్ (కళలు-కర్ణాటక), 9. శిబు సోరెన్ (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు-జార్ఖండ్, 10. ఉదయ్ కోటక్ (వాణిజ్యం, పరిశ్రమలు), మహారాష్ట్ర, 11. వీకే మల్హోత్రా (మరణానంతరం) ప్రజా వ్యవహారాలు-ఢిల్లీ, 12.వెళ్ళపల్లి నటేషన్ (ప్రజా వ్యవహారాలు-కేరళ), 13.విజయ్ అమృతరాజ్ (క్రీడలు-అమెరికా) పేర్లను కేంద్రం ప్రకటించింది.

రోహిత్ శర్మకు పద్మశ్రీ

ఇక, క్రీడా విభాగంలో భారత్ క్రికెట్ జట్టు సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్‌లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. జేఎన్‌యూ మాజీ వైఎస్ ఛాన్స్‌లర్ జగదీష్ కుమార్‌కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది.

Read Also- Minister Seethakka: చిలకలగుట్ట, ట్రైబల్ మ్యూజియంను సందర్శించిన మంత్రి సీతక్క

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?