LPG Cylinder Gas Price: శ్రీరామనవమిని జరుపుకున్న మరుసటి రోజే కేంద్రం (Central Govt).. దేశ ప్రజలకు షాక్ మీద షాక్ ఇచ్చింది. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ పైనా బాదుడు షురూ చేసింది. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ (LPG Gas Cylinder) ధరలను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
రూ.50 పెంపు
వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి (Shri Hardeep S Puri) సోమవారం వెల్లడించారు. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పెరిగిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని ఆయన కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత ధరలు ఇవే
ప్రస్తుతం ఎల్పీజీ 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 803గా ఉంది. సిలిండర్ ధర రూ.50 మేర పెంచడంతో అది రేపటి నుంచి రూ. 853కు అందుబాటులోకి రానుంది. అలాగే ఉజ్వల్ పథకం కింద ప్రస్తుత సిలిండర్ ధర రూ. 503 ఉంది. తాజా పెంపుతో అది రూ. రూ. 553కు చేరుకోనుంది.
Also Read: Sharmila on YCP: చెప్పుతో కొట్టినా, మీ చేష్టలు మారవా? వైసీపీపై షర్మిల ఫైర్..
ఆ భారం కంపెనీలదే..
అయితే పెట్రోల్, డీజిల్ ధరలపై విధించే ఎక్సైజ్ సుంకాన్ని సైతం కేంద్రం పెంచింది. లీటర్ కు రూ.2 మేర సుంకాన్ని బాదింది. దీంతో చమురు ధరలు సైతం పెరగబోతున్నట్లు ఒక్కసారిగా చర్చ మెుదలైంది. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పెరిగిన ఎక్సైజ్ భారాన్ని చమురు కంపెనీలే భరిస్తాయని స్పష్టం చేసింది.