MGNREGS: సంచలనం.. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం రద్దు?
nrega (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

MGNREGS: సంచలనం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు చేయబోతున్న కేంద్రం?

MGNREGS: మన దేశ గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పనలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఏటా కనీసం 100 రోజుల ఉపాధికి గ్యారంటీ అందిస్తున్న ఈ పథకం కింద కోట్లాది మంది లబ్ది పొందుతున్నారు. అయితే, అత్యంత కీలకమైన ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం (Central Government) రద్దు చేయబోతున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, కొన్ని కీలకమైన మార్పులతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో మరో కొత్త చటాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

కొత్త పథకం పేరు ‘గ్రామీణ్’

ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని రద్దు చేసి, ఆ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ (Gramin (గ్రామీణ్)) పేరిట కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.

‘వికసిత్ భారత్ 2047’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి రూపురేఖల్లో మార్పులు చేసి ఈ బిల్లును లోక్‌సభ సభలో కేంద్ర ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు-2025 ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే, 2005లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చరిత్రగా మిగిలిపోతుంది.

Read Also- Bharani Emotional: బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత భరణి ఎమోషనల్.. ఏం చెప్పారు అంటే?

125 రోజుల ఉపాధి!

కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రామీణ భారత ప్రజానీకానికి ఉపాధి విషయంలో సాధికారత కల్పించనున్నట్టు తెలుస్తోంది. అర్హులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని కల్పిస్తారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు, ఈ పథకానికి నిధులను కూడా పెంచనుంది. మొత్తంగా ఈ పథకానికి కీలకమైన మార్పులు చేసి, మెరుగులు దిద్ది కొత్త చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. కాగా, యూపీఏ ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (NREGA) తీసుకొచ్చింది. ఆ తర్వాత దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా పేరు మార్చింది.

పని హక్కుకు గ్యారంటీ కల్పిస్తూ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కార్మిక చట్టం, సామాజిక భద్రతా చర్యగా ఈ పథకం నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కుటుంబానికి ఉపాధిని కల్పిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన వయోజనులు ఏడాదికి కనీసం 100 రోజులపాటు పనిచేయవచ్చు. కనీస జీతం గ్యారంటీతో జీవనోపాధి భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. పని కోరిన 15 రోజుల్లోగా ఉపాధిని కల్పించకపోతే, ప్రభుత్వం వారికి నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. అంతేకాదు, మొత్తం ఉపాధిలో కనీసం మూడింట ఒక వంతు మహిళలకు ఉపాధిని కల్పించాలి

Read Also- Lionel Messi: ఢిల్లీలో అడుగుపెట్టిన మెస్సీ.. ఒక్కసారి షేక్‌హ్యాండ్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఫీజు ఎంతంటే?

 

Just In

01

VV Vinayak: ‘ఉస్తాద్‌ భగత్ సింగ్‌‌’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?

Jio New Year offers: హ్యాపీ న్యూఇయర్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

Social Media Ban: ఆస్ట్రేలియా తర్వాత 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం విధించనున్న మరో దేశం

Panchayat Results: రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Missterious: సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న “మిస్టీరియస్”