Narendra Modi (Image source Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Census 2027 Schedule: జనాభా లెక్కలకు ముహూర్తం ఫిక్స్!

Census 2027 Schedule: తదుపరి జనాభా లెక్కలకు (Census 2027 Schedule) ముహూర్తం ఖరారైంది. 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభమవుతుందని కేంద్రప్రభుత్వ (Central Govt) వర్గాలు వెల్లడించాయి. అయితే, మంచుతో కప్పి ఉండే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్టోబర్ 2026 నాటికే జనగణన (Censul) మొదలవుతుందని తెలిపాయి. లడఖ్, జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir), హిమాచల్ ప్రదేశ్ (Himalchal Pradesh), ఉత్తరాఖండ్ (UttarKhand) ఈ జాబితాలో ఉన్నాయి. దేశ జనాభా సమగ్ర గణనతో పాటు కీలకమైన సామాజిక, ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాలను కూడా కేంద్రం సేకరించనుంది. అంతేకాదు, ఈసారి జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టనున్నట్టు కేంద్ర వర్గాలు పునరుద్ఘాటించాయి. ఈసారి జనగణన రెండు దశల్లో జరగనుంది. దేశవ్యాప్తంగా పురుషులు, మహిళా జనాభాకు సంబంధించిన ప్రశ్నలు సహా కులం, ఉప కులాలకు సంబంధించిన ప్రశ్నలు అదనంగా ఉంటాయి.

Read this –BJP: పాకిస్థాన్ కూడా ఆ మాట వాడలేదు.. రాహుల్‌ గాంధీపై బీజేపీ తీవ్ర ఆగ్రహం

చివరిసారిగా 2011లో..
మన దేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. చివరిసారిగా 2011లో జాతీయ జనాభా లెక్కలు జరిగాయి. అయితే, కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనగణనను రద్దు చేయాల్సి వచ్చింది. మళ్లీ, 2027లో లెక్కింపు జరగనుండడంతో 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జనగణన జరగనుంది. దేశంలో సమర్థవంతమైన అభివృద్ధి విధానాల రూపకల్పనలో జనాభా లెక్కలు, సామాజిక, ఆర్థిక వివరాలు చాలా ముఖ్యమైనవని, ఖచ్చితమైన జనాభా డేటా కోసం జనగణన అవసరమని విపక్ష పార్టీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. జనాభా లెక్కింపు వీలైనంత త్వరగా చేపట్టాలని కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.

Read this – Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు వచ్చేశాయ్

ఏప్రిల్ నెలలో నిర్ణయం

విపక్షాల డిమాండ్ల నేపథ్యంలో జనగణనకు కేంద్రం నెలక్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేపట్టేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కులాలు, ఉప-కులాల గణన జనాభా లెక్కల్లో భాగంగా ఉండనున్నాయి. బీహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు కుల గణనను చేర్చుతూ కేంద్రం నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కులగణన చేపట్టాలంటూ బలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెలువరించింది.

Read this- RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..