Bridge Collapses: పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత ఎయిరిండియా విమాన దుర్ఘటనలను మరచిపోకముందే దేశంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని పుణె నగరానికి సమీపంలో ఉన్న ఇంద్రాయిని నదిపై నిర్మించిన ఫూట్ బ్రిడ్జి (Indrayani River Bridge Collapses) కుప్పకూలింది. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో 20 మందికిపైగా పర్యాటకులు గల్లంతు అయినట్టు తెలుస్తోంది. కుంద్‌మల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వర్షాకాలంలో ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి ప్రకృత అందాలను టూరిస్టులు ఆస్వాదిస్తుంటారు.
Read this- Vijay Rupani: 3 రోజుల తర్వాత మాజీ సీఎం డెడ్‌బాడీ గుర్తింపు
ఆరుగురు మృతి
బ్రిడ్జి కుప్పకూలిన దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు పర్యాటకులు చనిపోయినట్టు నిర్ధారణ అయ్యింది. మరో, 16 మంది టూరిస్టులు గల్లంతు అయినట్టు సమాచారం. కూలిన సమయంలో టూరిస్టులు అందరూ బ్రిడ్జిపైనే ఉన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో వారు పడ్డారు. ఒక్కసారిగా నది వరదలో కొట్టుకొని పోయాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు చేరుకున్నాయి. రెస్క్యూ చర్యలు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఎనిమిది మందిని కాపాడారు. ఇద్దరు మహిళలు ఇంకా బ్రిడ్జి కిందే చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కాగా, పుణె ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతంలో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అలర్ట్ అమలు ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. గత రెండు రోజులుగా ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read this- Zipline Mishap: పాపం పదేళ్ల బాలిక.. 30 అడుగుల ఎత్తు నుంచి..