Bihar Election Results Live Updates: బిహార్ ఎన్నికల కౌంటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మెుదలైంది. రాష్ట్రంలో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 4,372 లెక్కింపు టేబుళ్లలో కౌంటింగ్ సాఫీగా సాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటూ ప్రస్తుతం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే
బిహార్ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ మెుదలైదన మూడు గంటల వ్యవధిలోనే ఆ పార్టీ గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (122 సీట్లు) ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రస్తుతం 161 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకఠ్ బంధన్ 78 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అయితే మహాకఠ్ బంధన్ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ.. ఈ దఫా ఎన్నికల్లోనూ చతికిల పడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ కేవలం 20 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కూటమిలో ప్రధాన పార్టీ అయిన ఆర్జేడీ 60 స్థానాల్లో లీడ్ లో ఉంది.
ఎన్డీయే జోరు.. స్పష్టమైన ఆధిక్యం
బీహార్ లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం 103 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజంలో కొనసాగుతోంది. 67 స్థానాల్లో మహాగట్ బంధన్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మరో 18 స్థానాల్లో ఇతరులు లీడ్ లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్ అంచనాలను అందుకుంటూ కౌంటింగ్ లో బీజేపీ కూటమి ఆధిపత్యం చెలాయిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్యంటే?
బిహార్ లో అధికార ఎన్డీఏ, మహాఘట్ బంధన్ మధ్య కీలక పోటీ నెలకొనింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీ.య లోక్ మోర్చా, హిందూస్థానీ అవామ్ మోర్చా ఉన్నాయి. మహాఘట్ బంధన్ లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్, సీపీఐ, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలు బరిలో నిలిచాయి. మహాఘట్ బంధన్ తమ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ప్రకటించింది. ఎన్డీఏ మాత్రం సీఎం అభ్యర్థిని ధ్రువీకరించినప్పటికీ.. జేడీయూ నేత నవీన్ నితీశ్ కుమార్ నాయకత్వంలో పోలింగ్ లో నిలించింది.
రికార్డు స్థాయి పోలింగ్..
బిహార్ లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 67 శాతం మంది ఎన్నికల్లో ఓటు వేశారు. 2020 అంసెబ్లీ ఎన్నికల్లో వచ్చిన 57.3 శాతం ఓటింగ్ కంటే ఇది చాలా ఎక్కువ. ఈ పోలింగ్ లో పురుషులు 62.98 శాతం ఓటు వేయగా.. మహిళలు 71.78 శాతం మేర ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు శాతం పెరగడం తమ విజయానికి దోహదం చేస్తుందని ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోలింగ్స్ అంచనా వేశాయి.
❄️ చాణక్య స్ట్రాటజీస్ – ఎన్డీయే 130-138, ఎంజీబీ 100-108, జేఎస్పీ-0, ఇతరులు 3-8
❄️ దైనిక్ భాష్కర్ – ఎన్డీయే 145-160, ఎంజీబీ 73-91, జేఎస్పీ-0-3, ఇతరులు 5-7
❄️ డీవీ రీసెర్చ్ – ఎన్డీయే 137, ఎంజీబీ 83-93, జేఎస్పీ 2-4, ఇతరులు 1-8
❄️ జేవీసీ – ఎన్డీయే 135-150, ఎంజీబీ 88-103, * జేఎస్పీ 0-1, ఇతరులు 3-6
❄️ మార్టీజ్– ఎన్డీయే 147-167, ఎంజీబీ 70-90, జేఎస్పీ 0-2, ఇతరులు 2-8
❄️ పీ-మార్క్యూ – ఎన్డీయే 142-162, ఎంజీబీ 80-98, జేఎస్పీ 1-4, ఇతరులు 0-3
❄️ పీపుల్స్ ఇన్‌సైట్ – ఎన్డీయే 133-148, ఎంబీజీ 87-102, జేఎస్పీ 0-2, ఇతరులు 3-6
❄️ పీపుల్స్ పల్స్ – ఎన్డీయే 133-159, ఎంజీబీ 75-101, జేఎస్పీ 0-5, ఇతరులు 2-8
❄️ టీఐఎఫ్ రీసెర్చ్ – ఎన్డీయే 145-163, ఎంజీబీ 76-95, జేఎస్పీ -0, ఇతరులు 3-6
