Banglore News: ఐటీ ఉద్యోగులను సరదాలు, విలాసాలు, సంతోషాలకు కేరాఫ్ గా అందరూ భావిస్తుంటారు. చేతినిండా సంపాదన, ఖర్చుకు వెనకాడని నైజం, వీకెండ్స్ పబ్ కల్చర్ తో జీవితాన్ని భలే ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. భార్యతో కలిసి ఎలాంటి ఢోకా లేకుండా సంతోషంగా జీవిస్తారని అందరి అభిప్రాయం. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఐటీ ఉద్యోగులు భార్య బాధితులుగా మారిపోతున్నారు. కొందరైతే ఏకంగా ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఐటీ ఉద్యోగి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ లో అతడు చెప్పిన మాటలు విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.
ఫిర్యాదు ఎందుకంటే?
బెంగళూరులోని వయ్యాకావల్ పీఎస్ పరిధిలో నివసించే శ్రీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి 2022లో ఓ యువతితో వివాహమైంది. నగరంలోని సంపిగెహళ్లిలో వారిద్దరు కాపురం పెట్టారు. అయితే శ్రీకాంత్ ఐటీ ఉద్యోగి కావడంతో ఇంటి నుంచే విధులకు హాజరయ్యేవాడు. కొద్దిరోజులు శ్రీకాంత్ తో బానే కాపురం చేసిన ఆ యువతి.. ఆ తర్వాత నుంచి చుక్కలు చూపించడం ప్రారంభించింది. రోజుకు రూ.5000 చొప్పునే ఇస్తూనే కాపురం చేస్తానని బెదిరిస్తున్నట్లు శ్రీకాంత్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డ్యాన్స్ లు.. దూషణలు
అంతటి ఆగకుండా తన ఉద్యోగానికి ఎసరు తెచ్చే విధంగా తన భార్య ప్రవర్తించినట్లు పోలీసులకు శ్రీకాంత్ తెలియజేశాడు. జూమ్ కాల్ లో మాట్లాడుతున్న సమయంలో సడెన్ గా వచ్చి డ్యాన్స్ లు చేస్తున్నట్లు బాధితుడు వాపోయాడు. తోటి ఉద్యోగులు.. వీడియో కాల్ లో ఉండగా వారిముందే తనను అకారణంగా దూషిస్తున్నట్లు పేర్కొన్నాడు. దీంతో విసుగు చెంది విడాకులు ఇవ్వమని కోరితే రూ.45 లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పాడు. తనను వేధిస్తున్న భార్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వయ్యాలికావల్ ఠాణాలో బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు.
భార్య రియాక్షన్ ఇదే..
అయితే శ్రీకాంత్ ఆరోపణలను అతడి భార్య తీవ్రంగా ఖండించింది. అతడు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె చెప్పుకొచ్చింది. మరొకరిని పెళ్లి చేసుకునేందుకు శ్రీకాంత్ ఇలా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు అతడి భార్య పేర్కొంది. ఆడియోలు, వీడియోలను ఎడిట్ చేసి తనపై లేనిపోని నిందలు వేస్తున్నాడని భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా పోరాడతనని ఆమె వివరించింది.
Also Read: Kaloji Narayana Rao University: ఫలించిన ‘స్వేచ్ఛ’ కృషి .. వీసీని మార్చిన ప్రభుత్వం
ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు
భార్య వేధింపులు తట్టుకోలేక ఐటీ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కొద్దిరోజులుగా ఎక్కువయ్యాయి. ఇటీవల బెంగుళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి అతుల్ శుభాష్ భార్య టార్చర్ భరించలేక హోటల్ గదిలో ఆత్యహత్య చేసుకున్నాడు. తన భార్య వల్లే చనిపోతున్నట్లు తన సూసైడ్ నోట్ ను ఏకంగా కంపెనీ వెబ్ సైట్ లోనే పెట్టాడు. అలాగే యూపీకి చెందిన మానవ్ శర్మ అనే ఐటీ ఉద్యోగి కూడా గత నెల ఫిబ్రవరిలో ప్రాణాలు విడిచాడు. అతడికి గతేడాదే పెళ్లి కాగా భార్యతో కలిసి ముంబయిలో కాపురం పెట్టాడు. నిత్యం గొడవలు జరగడం, భార్య అదే పనిగా వేధిస్తుండటంతో మనస్థాపానికి గురై మానవ్ సూసైడ్ చేసుకున్నాడు.