Operation Mahadev
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Operation Mahadev: ముగ్గురు ఉగ్రవాదుల హతం.. చనిపోయింది వాళ్లేనా?

Operation Mahadev: జమ్ముకశ్మీర్‌ దారా సమీపంలోని లిద్వాస్ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కదిలికలపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అక్కడకు వెళ్లాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఉగ్రమూకపై విరుచుకుపడ్డాయి. ముష్కరులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లుతున్నది. ఉదయం 11 గంటలకు మొదలైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.

ముగ్గురి మృతి

ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. శ్రీనగర్ ఎస్ఎస్‌పీ సందీప్ చక్రవర్తి దీనిపై స్పందించారు. ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు(లష్కర్ ఏ తోయిబా) చనిపోయారని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడిలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

పహల్గామ్ ఉగ్రవాదుల కోసం వేట

గత నెలలో వచ్చిన సమాచారం ప్రకారం, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాచిగామ్ ప్రాంతానికి తమ స్థావరాన్ని మార్చినట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. సోమవారం జరిగిన ఆపరేషన్‌లో చనిపోయింది వారికి చెందినవారేనా కాదా అనేది తేలాల్సి ఉన్నది.

Read Also- Gambhir: గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఓ ప్లేయర్‌పై గంభీర్ హాట్ కామెంట్స్

ఆపరేషన్ మహాదేవ్ ముఖ్యాంశాలు

1. సోమవాం హర్వాన్ ప్రాంతంలోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత్ ఆపరేషన్ మొదలుపెట్టింది.

2. పక్కా సమాచారంతో హర్వాన్‌లోని ముల్నార్ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. సైనికులను గమనించిన ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి.

3. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతున్నది.

4. భీకర కాల్పుల నేపథ్యంలో అదనపు బలగాలను ఆ ప్రాతానికి పంపించారు అధికారులు. ఆపరేషన్‌ మహాదేవ్‌లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌ వాసులు.

Read Also- Harihara Veeramallu: ఇదేదో ముందే చేస్తే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యేది కదా.. నిర్మాత పైన పవన్ ఫ్యాన్స్ ఫైర్

Just In

01

Cough Syrup Deaths: దగ్గు సిరప్ తాగి ఆరుగురు చిన్నారుల మృతి.. తీవ్ర విషాదం

Ramchander Rao: ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు: రాంచందర్ రావు

Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?

MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!

DGP Shivdhar Reddy: స్థానిక సంస్థల ఎన్నికలే నా మొదటి ఛాలెంజ్: డీజీపీ శివధర్ రెడ్డి