Dogs Smell Tires: కుక్కలు ( Dogs ) ఎలాంటి విశ్వాసం చూపిస్తాయో మనందరికి తెలిసిందే. పెంపుడు జంతువులు అనగానే ముందు గుర్తొచ్చేది కుక్క. ఇక, విశ్వాసంలో దీనికి మించిన పెట్ ఇంకోటి లేదు. అందుకే, కుక్కలు పెంచుకోడానికి చాలా మంది ఎక్కువ మక్కువ చూపిస్తారు. అయితే, ఇదిలా ఉండగా ఈ డాగ్స్ మూత్ర విసర్జన చేసే పద్ధతి అన్ని జంతువులు కన్నా వేరుగా ఉంటుంది. కారు టైర్లు, పోల్స్ కనిపిస్తే చాలు.. వాటికి కళ్ళ పండగే.. పరుగెత్తుకుంటూ వెళ్లి వాటి పైన మూత్రవిసర్జన చేస్తుంటాయి. అసలు, అవి అలా ఎందుకు చేస్తాయో ఎవరికి తెలియదు. దాని వెనుకున్న అసలు రహస్యం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి, అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కుక్కల నిపుణులు ఏం చెబుతున్నారంటే..
కుక్కలు ( Dogs ) వెళ్లే మార్గం మధ్యలో పోల్స్, టైర్లను చూసినప్పుడు వాటిని బాగా పరిశీలించి, వెనుక వచ్చే ఇతర కుక్కలు కోసం ఇలా చేస్తాయట. ఇదే వాటికి సులువైన మార్గం కూడా.. ఒక కుక్క పోల్స్ పైన మూత్రవిసర్జన చేసినప్పుడు అవి ఒక మ్యాటర్ ని పాస్ చేస్తాయి. అంటే, ఆ వాసనతో కుక్క అక్కడికి వచ్చి వెళ్ళిందని అర్థం. ఇతర కుక్కలు ఆ వాసనను చూసిన వెంటనే వాటి ముద్రను కూడా వదిలి వెళతాయని అంటున్నారు.
Also Read: Mars Transit 2025: కర్కాటక రాశిలో అంగారక గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి భయంకరమైన కష్టాలు?
కుక్కలు సాధారణ ప్రదేశాల కంటే నిలువుగా ఉన్న ఉపరితలాల పైనే మూత్ర విసర్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాయట. అంటే, పోల్ పై మూత్ర విసర్జన చేసినప్పుడు అవి భూభాగాన్ని చేరతాయి. ఇలా చేస్తే కుక్క ముక్కుతో వాసన చూడటానికి ఈజీగా ఉంటుంది. దీంతో, ఇతర కుక్కలు కూడా వాటి మూత్రాన్ని వదులుతాయి.
అలాగే, కారు టైరులో కుక్క మూత్రం వాసన ఎక్కువ సేపు ఉంటుంది. అదే, భూమి మీద అయితే, తొందరగా పోతుంది. అందుకే ఇది టైర్ల పైనే మూత్రవిసర్జన చేయడానికి ఆసక్తి చూపుతాయని అంటున్నారు. డాగ్స్ రబ్బరు టైర్ల పైనే మూత్రం పోయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. వీటికి రబ్బరు వాసన అంటే చాలా ఇష్టమట. టైర్ కనిపిస్తే చాలు దాని దగ్గరికి వెళ్లి వెంటనే మూత్ర విసర్జన చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.