Aditya 369 Sequel Update: ప్రస్తుతం, తెలుగు సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. దీని వలన అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు హిట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ , మహేష్ బాబు, రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ , పవన్ కల్యాణ్ మూవీస్ మళ్లీ విడుదలయ్యాయి. తాజాగా, మరో చిత్రం రీరిలీజ్ కు సిద్ధమవుతోంది. నందమూరి బాలకృష్ట సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ గా నిలిచిన ” ఆదిత్య 369 ” (Aditya 369)ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 18 జూలై 1991 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రానికి నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
వచ్చే నెలలో ” ఆదిత్య 369 ” ( Aditya 369 ) సినిమా రి రిలీజ్ అవ్వబోతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. గాడ్ ఆఫ్ మాసెస్ స్టార్ హీరో బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ పాల్గొన్నారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబూ మోహన్, నిర్మాత హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ” ఆదిత్య 369 ” చిత్రం రిలీజ్ అయిన సమయంలో బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. ఈ సందర్భంగా వారు ఈ మూవీని మొదటిసారి ఎక్కడ చూశారో గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో తను, బాలకృష్ణ కలిసి ఎంత అల్లరి చేశామో బాబూ మోహన్ చెప్పారు.
బాలయ్య మాట్లాడుతూ ” ఆదిత్య 369 సినిమాను ఎంత కష్టపడి తెరకెక్కించారో తెలిపారు. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు తీస్తున్న సమయంలోనే ఈ మూవీ ఆఫర్ వచ్చిందని, కొత్త కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతోనే చేశానని చెప్పారు. సీక్వెల్‌కు ( Aditya 369 Sequel )ప్లానింగ్ అంతా ముగిసిందని, కేవలం ఒకే ఒక్క రోజులో కథను పూర్తి చేశామని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ” ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.