crows 2 ( Image Source: Twitter)
లైఫ్‌స్టైల్

Crows: కాకులు కూడా పగ పడతాయా? షాకింగ్ నిజాలు బయట పెట్టిన నిపుణులు

Crows: మనం తిన్న తర్వాత ప్లేట్స్ ను శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి వాడుతుంటాము. అలా శుభ్రపరిచే ముందు ప్లేట్స్ లోని అన్నం మెతుకులను నీటితో కడిగేటప్పుడు .. కాకులు గ్రహించి వెంటనే అక్కడికి వస్తాయి. మనం ఎప్పుడైనా వాటిని తరిమినా, లేదా హాని చేసినా, అవి మనిషిని గుర్తుపెట్టుకుంటాయని తెలుసా.. ఇది కేవలం ఊహ మాత్రమే కాదు. శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేసి ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించారు.

కాకులు పగ పడతాయా?

కాకులు మనుషుల మొఖాలను దశాబ్దాల పాటు గుర్తు పెట్టుకుంటాయి. ఇంకా చెప్పాలంటే అవి మనుషులను కూడా పగ బట్టగలవు. ఇవి ఎలా గుర్తు పెట్టుకుంటాయని సందేహిస్తున్నారా? దాని వెనుక సైన్స్ ఏం చెబుతుందంటే?

Also Read: India vs Australia 5th T20: కాసేపట్లో ఐదో టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పులు.. సిరీస్ గెలిచేదెవరు?

కాకులకు వాటి శరీర పరిమాణానికి ఉండాల్సింది దానికన్నా పెద్ద సైజ్ లో బ్రెయిన్ ఉంటుంది. ముఖ్యంగా నిడోపాలియం కాడోలాటరేల్ (Nidopallium Caudolaterale) అనే భాగం బాగా అభివృద్ధి చెందింది. ఇది మనిషి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ (Prefrontal Cortex) లాంటి పనితీరును కలిగి ఉంటుంది.. అంటే ఆలోచించడం, జ్ఞాపకాలను నిలుపుకోవడం, ముందస్తు ప్రణాళిక చేయడం వంటి సామర్థ్యాలకు ఇది కారణం. దీని వల్ల కాకులు ఎవరు తమకు మేలు చేసారు, ఎవరు హాని చేసారు అనేది గుర్తుపెట్టుకుని, దాని గురించి ఇతర కాకులతో పంచుకుంటాయి. అంటే, ఒక మనిషిని పగతో గుర్తుపెట్టుకోవడమే కాదు, మిగతా కాకులకు కూడా అతని గురించి హెచ్చరిక ఇస్తాయి.

Also Read: Robbery Gone Wrong: గోల్డ్ షాప్ ఓనర్ కళ్లలో కారంకొట్టి చోరీ చేద్దామనుకుంది.. కానీ చావుదెబ్బలు తిన్నది.. వీడియో ఇదిగో

శాస్త్రవేత్తల ప్రకారం, ఇది కాకులలో ఉన్న మేధస్సు, ప్రవర్తనకు నిదర్శనం. మనిషి లాగే భావాలు, జ్ఞాపకాలు, ప్రతీకార భావన కూడా ఉండగల పక్షులలో కాకులు అగ్రస్థానంలో ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాబట్టి ఇకపై మీరు తిన్న ప్లేట్లు కడిగేటప్పుడు కాకులు దగ్గరికి వస్తే వాటిని తరిమేయడంలో కాస్త జాగ్రత్త వహించండి.. అవి మిమ్మల్ని పగ బట్టకుండా ఉంటాయి.

దీని వెనుక శాస్త్రం ఏం చెబుతుందంటే?

కాకులకు హాని చేస్తే.. అవి భయంకరంగా మీ వెంట పడతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగకుండా ఆపగలవని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాదు, గతంలో కర్రలు, రాళ్ళు విసిరిన ప్రతి మనిషిని గుర్తు పెట్టుకుని మనుషుల మీద దాడి చేస్తాయని అంటున్నారు.

గమనిక: ఈ కథనం భక్తి భావంతో మాత్రమే రాయబడింది. ఇందులో పేర్కొన్న విషయాలు భక్తుల విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభవాల ఆధారంగా ఉంటాయి. ఎవరికీ భయం కలిగించడం లేదా (అమాయక విశ్వాసం) ప్రోత్సహించడం మా ఉద్దేశ్యం కాదు. దేవాలయ పూజలు, ఆచారాలు, నమ్మకాలు అన్నీ భక్తుల విశ్వాసానికి సంబంధించినవి. వాటిని గౌరవంతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Bigg Boss Telugu 9: ట్రోఫీకి, ఎగ్జిట్‌కి దగ్గరగా ఉందెవరంటే? మళ్లీ తనూజ చేతుల్లోనే ఎలిమినేషన్!

Jubilee Hills Bypoll: మూగబోయిన మైక్‌లు.. జూబ్లీహిల్స్‌లో ముగిసిన ప్రచారపర్వం

Temple hundi fire: కానుకలు వేసే హుండీలో కర్పూరం వేసింది.. ఓ భక్తురాలి అత్యుత్సాహం

Bandi Sanjay: ఆయన తండ్రే ఎం చేయలేక పోయిండు కొడుకు ఎం చేస్తాడు: బండి సంజయ్

Student death In US: ఛాతిలో నొప్పిని విస్మరించి.. అమెరికాలో ఏపీ యువతి మృతి