2026 Baba Vanga Prediction: బాబా వంగా జోస్యం నిజమవుతుందా?
Baba Vanga ( Image Source: Twitter)
లైఫ్ స్టైల్

2026 Baba Vanga Prediction: 2026 లో అన్ని దారుణాలు జరగబోతున్నాయా.. బాబా వంగా జోస్యం నిజమవుతుందా?

2026 Baba Vanga Prediction: ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన బాబా వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పిన అనేక భవిష్యవాణులు నిజమయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అందుకే ఆమె పేరు వచ్చినప్పుడల్లా ప్రజల్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. తాజాగా 2026కి సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంతో మళ్లీ బాబా వంగా పేరు వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.

Also Read Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

బాబా వంగా చెప్పిన 2026 లో ప్రధానంగా ప్రపంచాన్ని కుదిపేయగల టెక్నాలజీ మార్పు గురించే ఉంది. వచ్చే ఏడాది భూమిపై ఒక పెద్ద టెక్ మార్పు జరిగే అవకాశం ఉందని ఆమె ముందే చెప్పిందట. అందులో భాగంగా కృత్రిమ మేధస్సు (AI) మరింత శక్తివంతమై వివిధ రంగాల్లో ఆధిపత్యం పెంచుకోబోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. AI అడ్వాన్స్ అవ్వడంతో వ్యాపారాలు, ఉద్యోగాలు, మనుషుల జీవనశైలి వరకు చాలానే మారవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు. దీని వలన ప్రపంచం మీద భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read Mahabubabad District: ఆ గ్రామానికి 25 ఏళ్ల తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్.. అంగన్వాడి టీచర్ కు రాజీనామా.. సర్పంచ్ గా పోటీకి సిద్ధం

ఇదిలాఉండగా.. బాబా వంగా గతంలో చెప్పిన అనేక జ్యోస్యాలు నిజమయ్యాయని అందరికి తెలుసు. సోవియట్ యూనియన్ విరిగిపోవడం, అమెరికాలో 9/11 దాడులు, చైనా ఎదగడం, టెర్రరిజం పెరగడం వంటి అంశాలను ఆమె ముందే చెప్పినట్టు ప్రచారం ఉంది. అంతేకాదు, 2025లో భూకంపం, యుద్ధాల గురించి కూడా ముందే సూచించిందని అనేక పోస్టులు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇండియా–పాక్, పాక్–అఫ్గాన్, ఇజ్రాయెల్–ఇరాన్, థాయిలాండ్–కాంబోడియా మధ్య జరిగిన యుద్ధాలను కూడా ఆమె భవిష్యవాణిలో చెప్పినట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Also Read Panchayat Elections: సోషల్ మీడియా వేదికగానే పోటాపోటీ ప్రచారం.. ఓటర్లను ఆకర్షించేందుకు నూతన ఒరవడులు

ఆర్థిక రంగానికి సంబంధించి కూడా కొన్ని పెద్ద అంచనాలు బయటకు వస్తున్నాయి. 2026లో ఆర్థిక అస్థిరత రావచ్చన్న వార్తల నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఎక్కువగా బంగారంలాంటి భద్రతైన ఆస్తులవైపు మళ్లుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా గ్లోబల్ గోల్డ్ ధరలు ఇప్పటికే పరుగులు పెడుతున్నాయి. కొందరు విశ్లేషకుల ప్రకారం వచ్చే రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు 25% నుంచి 40% వరకు పెరగొచ్చని అంచనా. కొన్ని వైరల్ పోస్టుల్లో అంతర్జాతీయ గోల్డ్ ధర ఔన్స్‌కు $4,300 దాటిపోయిందని కూడా చెబుతున్నారు. ఇండియా మార్కెట్లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షల వరకు ఉంది. డిమాండ్ ఇంకా పెరిగితే ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?