vijay-dalapathi(Image :X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

TVK rally stampede: కరూర్ ఘటనపై దళపతి ఎమోషనల్ పోస్ట్.. వారికి సాయం ప్రకటన..

TVK rally stampede: తమిళ నటుడు, తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్ నిర్వహించిన పార్టీ ర్యాలీలో (TVK Rally Stampede) పెనువిషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 39 మంది ప్రాణాలు విడిచారు. మృతుల్లో చిన్నపిల్లలతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మృతి చెందిన వారిలో పిల్లలు మినహా మిగతావారంతా విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ కార్యకర్తలేనని సమాచారం. కాగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ విజయంపై టీవీకే పార్టీ అధినేత స్పందించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ టీవీకే సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు.

Read also-OG copy controversy: ఆ విషయంలో థమన్‌పై మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

‘కల్పనకు కూడా అందని విధంగా, కరూరులో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, హృదయం, మనసు భారంగా మారిపోయాయి. మన సంబంధాలను కోల్పోయి బాధపడుతున్న ఈ దుఃఖ స్థితిలో, నా మనసు అనుభవిస్తున్న నొప్పిని ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేను కలిసిన మీ అందరి ముఖాలు నా మనసులో వచ్చి, పోతున్నాయి. ప్రేమ, స్నేహం చూపే నా బంధువులను ఆలోచిస్తూ, అది నా హృదయాన్ని మరింత బలంగా దాని స్థానం నుండి జార్చేస్తోంది. మన ప్రాణప్రియ సంబంధాలను కోల్పోయి బాధపడుతున్న మీకు, చెప్పని నొప్పితో పాటు, సానుభూతిని తెలియజేస్తున్నాను. అదే సమయంలో, ఈ దుఃఖాన్ని మీ మనసుకు సమీపంగా నిలబడి, పంచుకుంటున్నాను.

మనకు ప్రతిపలం చేయలేని కోల్పోయినదే. ఎవరు ఎంత ఓదార్చినా, మన సంబంధాల కోల్పోయిన నొప్పిని తట్టుకోలేకపోతామే. అయినప్పటికీ, మీ కుటుంబంలో ఒకరిగా, సంబంధాన్ని కోల్పోయి బాధపడుతున్న మన బంధువుల కుటుంబాలకు ప్రతి ఒక్కటికీ 20 లక్షల రూపాయలు, గాయపడి చికిత్స పొందుతున్నవారికి ప్రతి ఒక్కరికీ 2 లక్షల రూపాయలు సాయం అందించాలని భావిస్తున్నాను. కోల్పోయిన వారి ముందు ఇది పెద్ద మొత్తమే కాదు. మీ కుటుంబానికి చెందినవాడిగా, నా కర్తవ్యం ఇదే. అలాగే, గాయపడి చికిత్స పొందుతున్న మన అందరు సంబంధులు త్వరగా కోలుకుని, ఇంటికి తిరిగి వచ్చేలా దేవుడిని ప్రార్థిస్తున్నాను. చికిత్సలో ఉన్న మన సంబంధుల అందరికీ అన్ని సహాయాలు మన తమిళనాడు వెట్రి కళగం ఖచ్చితంగా అందిస్తుందని తెలియజేస్తున్నాను. దేవుని కృపతో,మనం మళ్లీ లేచి నిలబడటానికి ప్రయత్నిస్తాం. అంటూ రాసుకొచ్చారు.

Read also-CM Revanth Reddy: విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్.. ఏటీసీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

విజయ్ ర్యాలీ కోసం జనాలు దాదాపు 6 గంటలపాటు వేచిచూశారని, విజయ్ ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కాగా, ర్యాలీకి హాజరైన జనాల రద్దీ, తొక్కిసలాటను గుర్తించి విజయ మధ్యలోనే తన ప్రసంగాన్ని నిలిపివేశాడు. తొక్కిసలాటను గుర్తించి తన ప్రత్యేక ప్రచార బస్సు మీద నుంచే వాటర్ బాటిళ్లు విసిరి జనాలకు నీరు అందించాడు. జనాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రమాద స్థలానికి అంబులెన్సులు చేరుకోవడం కూడా ఇబ్బంది ఎదురైంది. విజయ్ బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని, విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ అధికార డీఎంకే పార్టీ నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

Just In

01

Thaman S: ‘ఓజీ 2’ మాత్రమే కాదు.. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయ్..

Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

Ind-Pak Toss Update: ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్‌.. టాస్ గెలిచిన భారత్.. జట్టులో కీలక మార్పు

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి