CM Revanth Reddy: ఏటీసీ విద్యార్ధులకు ప్రతి నెల రూ.2 వేలు స్కాలర్ షిప్ లను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈ బాధ్యత డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబులు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అంతేగాక ఆర్టీసీలో అప్రంటీస్ ఇచ్చేలా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్యలు తీసుకోవాలని సూచించారు ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చదువుకు మాత్రమే తలరాతలను మార్చే శక్తి ఉన్నదన్నారు.
Also Read: Ind Vs Pak Final: ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, పాండ్యా ఆడడం లేదా?.. కోచ్ షాకింగ్ అప్‌డేట్
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం
మీ సోదరుడిగా మీ భవిష్యత్ కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. తెలంగాణ యువతకు జపనీస్ నేర్పి అక్కడ ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు జపాన్ సిద్ధంగా ఉన్నదన్నారు. మనిషికి తెలివి, పని చేసే కమిట్మెంట్ ఉంటే చాలు ఉన్నత స్థానానికి చేరుకోవవచ్చన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలన్నారు.
క ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదట 1956 లో ఐటీఐలను ప్రారంభించారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదన్నారు. కోర్సులను అప్ గ్రేడ్ చేయకపోవడంతో కాలక్రమేనా ఐటీఐలు నిర్వీర్యమయ్యాయన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఐటీఐలను పునరుద్ధరించాలని ఆలోచన చేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా అప్ గ్రేడ్ చేశామన్నారు. సంకల్పంఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని, కష్టపడి బాధ్యతతో ముందుకు సాగిస్తే అన్నింటినీ సాధ్యం చేయవచ్చన్నారు.
మరో 51 ఏటీసీలను మంజూరు
తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రస్తుతం ప్రారంభించుకున్న 65 ఏటీసీలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 65 ఎటీసీలను పూర్తి చేశామన్నారు. ఇప్పుడు మరో 51 ఏటీసీలను మంజూరు చేశామన్నారు. ఏడాదిలోగా 51 ఏటీసీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నైపుణ్యం లేకపోతే సర్టిఫికెట్లు ఎందుకూ ఉపయోగపడవన్నారు. యువతకు నైపుణ్యం అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని, యువతకు నైపుణ్యంగా అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సాంకేతిక నైపుణ్యంపై ఫోకస్ పెట్టాలని, జర్మనీ, జపాన్ లు కూడా మన ముందు మోకరిల్లే రోజు వస్తుందన్నారు. డ్రగ్స్, గంజాయి ఈ సమాజానికి పట్టిన చీడ అని, ఆ వ్యసనాలకు ఎట్టి పరిస్థితుల్లో బానిస కావొద్దని, తల్లిదండ్రులకు బాధను మిగల్చవద్దని కోరారు.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఈసీ సమావేశం.. నేడు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం!