bengaluru traffic
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Bike Taxi: బైక్ ట్యాక్సీలపై నిషేధం.. 5 రెట్లు పెరిగిన ట్రాఫిక్!

Bike Taxi: అవును.. హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఎంతలా అంటే.. ఎటు చూసినా ట్రాఫిక్ పెరిగిపోవడం, ప్రత్యామ్నాయ మార్గం లేక జనాలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటున్నారేమో.. కాదులెండి. ఈ వ్యవహారం అంతా బెంగళూరులో నడుస్తున్నది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు బైక్ ట్యాక్సీ సేవలను నిషేధించడం జరిగింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, వ్యక్తిగత టూ-వీలర్‌లను ప్రయాణీకులను చేరవేసే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. వాణిజ్య రిజిస్ట్రేషన్.. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే ప్రయాణీకులను రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు. రాపిడో, ఊబర్ మోటో, ఓలా బైక్ వంటి అగ్రిగేటర్లు లైసెన్స్ లేకుండా తమ సేవలను అందిస్తున్నారని రవాణా శాఖ చాలా కాలంగా వాదిస్తోంది. భద్రత, బీమా కనీసం లైసెన్సింగ్ సమస్యలను ప్రభుత్వం లేవనెత్తింది.

Read Also- Nagabandham: అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో 5000 మందితో..

అసలేం జరిగింది?
వాస్తవానికి.. 2021లో ప్రభుత్వం ఒక ఇ-బైక్ ట్యాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ, భద్రత.. దుర్వినియోగం గురించిన ఆందోళనల కారణంగా అది గత సంవత్సరం రద్దు చేయబడింది. అప్పటి నుంచి, బైక్ ట్యాక్సీలను నియంత్రించడానికి ప్రభుత్వం స్పష్టమైన నియమాలను లేదా కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించలేదు. ఆ క్రమంలోనే ఆటోరిక్షా యూనియన్లు కూడా బైక్ ట్యాక్సీలను పూర్తిగా నిషేధించాలని గట్టిగా డిమాండ్ చేశాయి. తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని భావించి రంగంలోకి దిగిన పరిస్థితి. అయితే.. బైక్ ట్యాక్సీలు లేకపోవడంతో, ఎక్కువ మంది ప్రజలు ప్రైవేట్ వాహనాలు లేదా ఆటోలను ఉపయోగించవలసి వస్తోంది. ఇది ఇప్పటికే రద్దీగా ఉండే రోడ్లపై భారాన్ని పెంచుతున్నది. దీన్నే సువర్ణావకాశంగా మలుచుకున్న ఆటో రిక్షాలు.. టాక్సీల ధరలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది ప్రయాణీకులు ఇప్పుడు రోజుకు రూ.500 వరకు చెల్లిస్తున్నట్లు గగ్గోలు పెడుతున్నారు. ఇది బైక్ ట్యాక్సీల ద్వారా అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ.

ఇప్పుడు పరిస్థితేంటి?
ఇవన్నీ ఒకెత్తయితే.. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన తర్వాత ట్రాఫిక్ ఐదు రెట్లు పెరిగిందని జనం వాపోతున్నారు. రాపిడో, ఊబర్ మోటో, ఓలా బైక్ నిషేధం వల్ల ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం ఏంటనేది తోచట్లేదు. కేవలం కిలోమీటర్ ప్రయాణానానికే ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు లేదా ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. తద్వారా, ఇది ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తోందని పౌరులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రోజువారీ ప్రయాణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయని.. కొందరు ఏకంగా ఒక్క రోజుకే రూ.500 వరకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు.. పేలవమైన రోడ్లు, యూ టర్న్‌లు లేకపోవడం, పరిమిత మెట్రో సదుపాయం, సరిపోని ప్రభుత్వ బస్సులు వంటి మౌలిక సదుపాయాల కొరత కూడా ట్రాఫిక్ సమస్యలను మరింత పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మెట్రో నెట్‌వర్క్ పెరుగుతున్నప్పటికీ, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ మెట్రో కనెక్టివిటీ ఊసే లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ బస్సులు కూడా అంతంత మాత్రంగానే పరిమితంగా ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సుముఖంగా లేనట్లేనని తెలుస్తున్నది.

Read Also- YS Jagan: రప్పారప్పా నరుకుతామంటే తప్పేంటి?

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు