YS Jagan Vs Lokesh
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Jagan Vs Lokesh: వైఎస్ జగన్ రె‘ఢీ’నా.. 10 నిమిషాలు చాలు.. మంత్రి విచిత్ర ఛాలెంజ్!

Jagan Vs Lokesh: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తెనాలి పర్యటన తీవ్ర వివాదాస్పదం అయ్యింది. గంజాయి బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ.. జగన్ పరామర్శించడం ఏమిటి? అని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. జగన్ మామ కాస్త గంజాయి మామ అయ్యారని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కెబినెట్‌లో యంగ్ మినిస్టర్ ఒకరు విచిత్రమైన ఛాలెంజ్ చేశారు. ఇప్పుడిదే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియా వేదికగా సంచలనం, అంతకుమించి వైరల్‌గా మారింది. ఆ మంత్రి మరెవరో కాదు వాసంశెట్టి సుభాష్ (Vasamsetti Subhash). ‘మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) పది నిమిషాలు వైఎస్ జగన్ డిబేట్‌లో కూర్చోగలరా? డిబేట్‌లో జగన్‌కు ఉన్న నాలెడ్జ్ ఎంతో తేలిపోతుంది’ అని ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌పై ఇంతవరకూ వైసీపీ స్పందించలేదు కానీ.. ఆ పార్టీ శ్రేణులు మాత్రం సోషల్ మీడియా (Social Media) వేదికగా ఓ రేంజిలో స్పందిస్తూ.. తీవ్ర దుమారం రేపేలా సమాధానం ఇస్తున్నారు.

Vasamsetti Subhash
Vasamsetti Subhash

వైసీపీకి శుభాకాంక్షలు!
వైసీపీ నేతలు, వైసీపీకి మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ వాసంశెట్టి సెటైర్లు వేశారు. ‘జగన్ బతుకే వెన్నుపోటుతో ప్రారంభించారు. కొండా సురేఖను జగన్‌ పట్టించుకోలేదు. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక‌ స్థానం జగన్‌కే సొంతం. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? బుడమేరు ఏంటనేది కూడా తెలీకుండా అపహాస్యం పాలయ్యారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. శవ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వచ్చి అప్రూవర్‌గా మారారు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలకు అనవసరపు బ్యానర్లు పెట్టి శిక్షల పాలవ్వద్దు. భిక్షగాడి అవతారం ఎత్తి బాబ్బాబు అని అడుక్కుంటున్నారు. జగన్ మానసిక స్ధితి బాగోలేదు. వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ. వెన్నుపోటు దినోత్సవం పేరుతో వాళ్లు వేసిన పోస్టర్లు ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి? ఆ పోస్టర్‌పై చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తాం. లిక్కర్ కేసు కాదు అనేక కేసుల్లో జగన్ అక్రమాలకు పాల్పడ్డారు. నాడు సీఎంను కలవాలంటే ఆర్థికపరమైన అంశాలు మాత్రమే ఉంటేనే కలుస్తారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని పాతిపెట్టారు కాబట్టి వారికి వర్ధంతి శుభాకాంక్షలు. గతంలో వైసీపీ తరఫున గంజాయి అక్రమాలు చేశారు కాబట్టి వారికోసం ఇప్పుడు జగన్ తెనాలి పరామర్శకు వెళ్లాడు. చావుకి వెళ్ళినా.. పెళ్లికి వెళ్ళినా చిరునవ్వు తప్ప ఇంకోటి ఉండదు. ఈయన చిరునవ్వుతో చనిపోయిన వారు లేసి వస్తారేమో? తుని అంశం చట్ట పరిధిలో ఉంది. తుని కావచ్చు కోనసీమ అల్లర్లు కావచ్చు ఈ రెండూ వైసీపీ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకే ప్రయత్నాలు చేసింది’ అని సుభాష్ చెప్పుకొచ్చారు.

Read Also- RCB Fan: కప్ కోసం ఎంతకు తెగించార్రా.. ఆర్‌సీబీ ఫ్యాన్ పనికి అవాక్కవాల్సిందే!

జగన్ రెడ్డి కాదు.. రంగుల రెడ్డి!
వైఎస్ జగన్ ఒక రంగుల రెడ్డి అని మంత్రి సబిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ జగన్‌వి చీప్ పాలిటిక్స్. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారు. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశాం. జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే. జగన్ ఖబడ్దార్. మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించలేదు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది నీవు కాదా? ప్రజలు మీకు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోండి. మీ బాబాయి ని చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదు? ఎన్నికల హామీలు మీరు ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా? రైతులకు నీవు ఎలా మోసం చేశావో తెలుసు. పింఛన్‌ను రూ.3 వేల నుంచి 4 వేలు ఒకేసారి పెంచాం. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ప్రభుత్వం ఎక్కడ ఉందో చూపించు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం. జగన్ నీ భూ చట్టాలను రద్దు చేశాం. నీ హయంలో ఎన్ని లక్షల ఎకరాలు అక్రమాలు చేశారో ఇప్పుడు బయటికి వస్తున్నాయి. రాయలసీమను అభివృద్ధి చేసింది చంద్రబాబు. కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ధ్వంసం చేశారు’ అని సబిత తీవ్ర విమర్శలు చేశారు.

Tenali Incident

సిగ్గుండాలి..!
గంజాయి అమ్మే రౌడీ మూకలను పరామర్శించేందుకు తెనాలి వెళ్లిన వైఎస్ జగన్ రెడ్డికి సిగ్గుపడాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ‘ తొమ్మిది కేసులు ఎదుర్కొంటున్న జాన్ విక్టర్ అమాయకుడైన అడ్వకేట్ అంటూ చెప్పడం జగన్‌కే చెల్లింది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ రౌడీ మూకలతో దాడులు చేయించడమే రాజకీయంగా నడిపిన వ్యక్తి జగన్. గత ఎన్నికల్లో జగన్ రౌడీ రాజకీయానికి చెంప చెళ్లుమనిపించినా, క్రిమినల్ బుద్ది అయితే ఇంకా మారలేదు. డ్రైవర్ సుబ్రమణ్యం కుటుంబాన్ని కనీసం పరామర్శించని జగన్.. గంజాయి ముఠా వద్దకు మాత్రం పరిగెత్తుకొని వెళ్లారు. జగన్‌కు తెలిసిందల్లా అరాచకం, బెదిరింపులు, అవినీతి, విధ్వంసం మాత్రమే’ అని అనగాని విమర్శలు గుప్పించారు.

Read Also- ipl final 2025: ఒకే ఒక్కడు.. ఫైనల్ వేళ అందరి దృష్టి అతడి పైనే!

ఇంత ఫ్రస్టేషనా..?
ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్, రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లకు మద్దతు ఇవ్వడం ఏమిటి? అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ‘ సభ్యసమాజం ఏమనుకుంటుందో అనే అలోచన కూడా జగన్‌కు లేదు. గంజాయి వ్యాపారులు, డ్రగ్ డీలర్లు, బ్లేడ్ బ్యాచ్‌లకు జగన్‌ను గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందేమో? మద్యం కుంభకోణంలో వేళ్లు అన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి.. గనుకే జగన్‌లో రోజురోజుకీ ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది. తన పాలనలో చేసిన నేరాలపై నుంచి దృష్టి మళ్లించేందుకు జగన్ చౌకబారు డ్రామాలు ఆడుతున్నారు. గంజాయి అమ్మడం, ఆడపిల్లలను వేధించడం నేరం కాదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నేరస్తులను ఒలంపిక్స్‌లో మెడల్ సాధించినట్లుగా వారిని పొగుడుతున్న జగన్‌కు సంస్కారం లేదు. ఇసుక దందా గురించి వైసీపీ నేతలను ప్రశ్నించినందుకు వరప్రసాద్‌ను పోలీస్ స్టేషన్‌లో అవమానకరంగా శిరోముండనం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి, శవాన్ని డోర్ డెలివరీ చేశారు. కేసు నమోదు చేసినా పట్టించుకోలేదు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడం, ఆడపిల్లల రక్షణ, గంజాయి నిర్మూలన, ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. గతంలో మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టారు, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు’ అని ఆనందబాబు మండిపడ్డారు.

ఇంత దిగజారుడగా?
నేరగాళ్లకు వైఎస్ జగన్‌ పరామర్శ అనేది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ఠ అని ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు అనే సామెత జగన్‌లాంటి వారిని చూసే వచ్చింది. రాజకీయంగా జగన్ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజలపై ప్రతీకారంగా వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. ఎవరికి వెన్నుపోటు? జగన్ అన్ని హామీలు మొదటి ఏడాది చేశారా? కళ్యాణమస్తు ఎప్పుడు చేశారు.. ఆఖరి ఏడాది చేశారు. నేను ఇంత సంక్షేమం చేసినా నన్ను ఓడించారని జగన్ వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. గంజాయి, చైన్ స్నాచింగ్‌లో జైలుకి వెళ్లి వచ్చి కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిని రోడ్డు మీద కొట్టారు. ఎన్నో సార్లు జైలుకి వెళ్లొచ్చిన బ్యాచ్‌కు జగన్ సానుభూతి తెలపడం దురదృష్టకరం. సంఘ విద్రోహ శక్తులకు నేను ఉన్నానని జగన్ చెప్పడం దారుణం. జాన్ విక్టర్ ఎస్సీ ఎలా అవుతాడు? ఎస్సీ రంగు ఎందుకు? పోలీసులపై హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్‌ అండదండలు ఎందుకు? నాడు ఎంపీగా ఉన్నప్పుడు సునీల్‌కుమార్‌తో నన్ను కస్టడీలో కొట్టించింది కూడా వైఎస్ జగనే. ఆయన్ను చూసి జాలిపడటం తప్ప ఇంకేమీ చేయలేం’ అని రఘురామ ఎద్దేవా చేశారు.

TDP

Read Also- YS Jagan: సీఎం చంద్రబాబును న‌డి రోడ్డుపై కొడ‌తారా?

జగన్ 2.0కు నిదర్శనం..
వైఎస్ జగన్ మరోసారి సైకోలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ తెనాలిలో పోలీసు వాహనంపైకెక్కి సైకోలు హల్‌చల్ చేయడం జగన్ 2.0కు నిదర్శనం. ఇలాంటి పైశాచిక సైకోలకు మద్దతు పలకడానికి వెళ్లేందుకు సిగ్గుండాలి. ప్రజలు దిక్కరించినా మీ వైఖరిలో మార్పు రాలేదు. జగన్ లాంటి వ్యక్తులు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు లేదు. జగన్ 2.0 చూపిస్తానంటూ సైకోలను ఉసిగొల్పి అరాచకాలను మళ్ళీ మొదలెట్టే ప్రయత్నం జరుగుతోంది. పోలీసులు వాహనం మీద హల్‌చల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పోలీసులకు సంబంధించి జగన్‌ వచ్చి రాజముద్ర వేస్తారా? జగన్‌పై 36 కేసులు ఉన్నాయి. రూ.43వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ నిర్ధారించింది’ అని నరేంద్ర చెప్పుకొచ్చారు.

Read Also- Nagarjuna: 45 ఏళ్లు వచ్చినా నాగ్ హీరోయిన్ పెళ్లి చేసుకోలేదేం?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?