Medical Recruitment jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు త్వరలోనే తీపికబురు అందనుంది. రాష్ట్ర ఆరోగ్యశాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు మెుదలయ్యాయి. ఒకేరోజు మూడు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి మెడికల్ రిక్రూట్‌మెంట్ రెడీ అయ్యింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
Also Read: Viral Video: అమ్మబాబోయ్.. ఆకాశం నుంచి ఊడిపడ్డ మేఘాలు.. మీరూ చూసేయండి!
ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో 3212 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్టసిస్ట్, 1284 ల్యాబ్ టెక్నీషియన్, 1950 మల్టి పర్పస్ ఫీమెల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వాటి ఫలితాలను విడుదల చేసిన మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డ్.. ప్రస్తుతం మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తోంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెడికల్ కాలేజీల్లోని పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం 3 నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.