Police Recruitment 2025: నిరుద్యోగులకు బీహార్ పోలీస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2025 రిక్రూట్మెంట్ లో భాగంగా మొత్తం 19,838 కానిస్టేబుల్ పోస్టులకు ధరఖాస్తులు కోరుతోంది. 12వ తరగతి, 10వ తరగతి అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 18-03-2025న ప్రారంభమై 18-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి బీహార్ పోలీస్ వెబ్‌సైట్, csbc.bihar.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పోలీస్ కానిస్టేబుల్ ఖాళీ నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బీహార్ పోలీస్ అధికారికంగా కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత , దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ లింక్ పై csbc.bihar.gov.in/ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బీహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు రుసుము
SC/ST/మహిళ/లింగమార్పిడి అభ్యర్థులకు: రూ. 180/-
మిగతా అభ్యర్థులందరికీ: రూ. 675/-
బీహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 18-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 18-04-2025
Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!
బీహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
అన్‌రిజర్వ్డ్ (UR) కోసం గరిష్ట వయోపరిమితి: 25 సంవత్సరాలు
వెనుకబడిన తరగతి (BC) & EBC కోసం గరిష్ట వయోపరిమితి: 27 సంవత్సరాలు
SC/ST కోసం గరిష్ట వయోపరిమితి: 30 సంవత్సరాలు
మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి : 28 సంవత్సరాలు
అర్హత
అభ్యర్థులు 12వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి
బీహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025 ఖాళీ వివరాలు
కానిస్టేబుల్ – 19838
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు