Australia ( Image Source: Twitter)
అంతర్జాతీయం

Australia: ఒళ్లుగగుర్పొడిచే కాలం.. ఎక్కడ చూసినా లక్షల్లో స్పైడర్లు.. వణుకుపుట్టాల్సిందే!

Australia: ఆస్ట్రేలియాలో ఎక్కువగా వినిపించే పేరు “స్పైడర్ సీజన్”. ఈ సీజన్ గురించి తెలిస్తే మీరు కూడా భయపడతారు. క్యాలెండర్‌లో ఉండే ఇది ప్రత్యేకమైన సీజన్ కాదు. అతి భయంకరమైన సీజన్ అని చెప్పుకోవాలి. కానీ, సంవత్సరంలో కొన్ని రోజుల పాటు భారీగా సాలెగాళ్లు బయటకు రావడం, గాల్లో ఎగరడం, ఇళ్ల మీద, పొలాల్లో, రోడ్లపై ఇలా ఎక్కడ పడితే అక్కడ వేల సంఖ్యలో కనిపించడం వంటివి జరుగుతాయి. ఇది ఎక్కువగా లేట్ సమ్మర్ నుండి ఎర్లీ ఆటమ్ సమయంలో జరుగుతుంది. ఈ సమయంలో భారీ వర్షాలు, వరదలు వలన నేల తడిసిపోవడంతో, తమ గూళ్లు నీటిలో మునిగిపోతాయని భావించి.. సాలె పురుగులు పెద్దఎత్తున బయటకు వస్తాయి. జీవనోపాధి కోసం సురక్షిత ప్రదేశాలను వెతుక్కుంటూ వీటి గుంపులు అటూ ఇటూ కదులుతాయి.

బెలూనింగ్ అంటే ఏమిటి?

స్పైడర్ సీజన్‌లో ఎక్కువగా కనిపించే ఆశ్చర్యకర విషయం ఇది. బెలూనింగ్ అనేది సాలెగాళ్లు గాలిలో ప్రయాణం చేసే సహజ పద్ధతి. ఇవి గాల్లో కూడా ఎగురుతాయి. అలా ఎగరడానికి ఏమి చేస్తాయంటే.. సాలీ పురుగు తన శరీరం వెనుక భాగం నుండి సున్నితమైన సిల్క్ తీగ వదులుతుంది. గాలి ఆ సిల్క్‌ను పైకి లేపుతుంది. వెంటనే సాలీ పురుగు కూడా గాల్లో తేలిపోతుంది. ఇలా సాలీ పురుగులు కొన్ని కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలవు. ఈ కారణంగా, ఒకేసారి వేలల్లో సాలె పురుగులు గాల్లో ఎగిరిపోతూ కనిపిస్తాయి. పొలాలు కూడా తెల్లటి సిల్క్‌తో కప్పబడినట్లు కనిపిస్తుంది.

ఎందుకు ఎక్కువగా ఈ సమయంలోనే జరుగుతుంది?

భారీ వర్షాలు, వరదల తర్వాత నేల మొత్తం నానిపోవడం వల్ల గూళ్లలో ఉండలేక ఆహారం కోసం కొత్త ప్రదేశాలకు వెళతాయి. ఈ కారణాల వల్లే లేట్ సమ్మర్–ఎర్లీ ఆటమ్ సమయంలో స్పైడర్లు పెద్ద ఎత్తున చలనం చూపుతాయి.

ఇవి మానవులకు ప్రమాదమా?

ఎక్కువ శాతం సాలెగూళ్లు మనుషులకు ప్రమాదం కానివే. కానీ, కొన్ని విష సాలె పురుగులు ఉంటే, ప్రభుత్వాలు ముందే హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇళ్లలోకి రాకుండా ఉండేందుకు విండోలు, డోర్లు మూసుకోవాలని సూచిస్తారు.

Just In

01

CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!

Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ని ఏడిపిస్తున్న బిగ్ బాస్.. రీతూపై పవన్ ఫ్యామిలీ ప్రేమ చూశారా?

Digital Payments: భారత్ ను ఫాలో అవుతున్న పెరూ.. అక్కడ కూడా UPI తరహా చెల్లింపు వ్యవస్థ

Lava Agni 4: Demo at Home క్యాంపెయిన్ తో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్న Lava Agni 4

Nagarkurnool District: ఒరేయ్ అది ఆటోనా లేక స్కూల్ బస్సా.. 23 మందిని ఇరికించేశావ్.. నీకో దండంరా దూత!