Trump Tariffs: అక్టోబర్‌లో భారత్ ఎగుమతులు పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నాయి. ట్రంప్ టారిఫ్స్, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఇతర విధాన పరిమితుల కారణంగా ప్రధాన ఎగుమతి మార్కెట్లలో షిప్‌మెంట్లు గణనీయంగా తగ్గాయి. ట్రేడ్ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (GTRI) తెలిపిన తాజా వివరాల ప్రకారం, భారత్ టాప్ 20 ఎగుమతి మార్కెట్లలో కేవలం ఐదు దేశాల్లో మాత్రమే ఎగుమతులు పెరిగాయి. మిగతా 15 మార్కెట్లు తగ్గడం, భారత్ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఏ దేశాల్లో ఎగుమతులు పెరిగాయి?
అక్టోబర్‌లో మొత్తం ఎగుమతులు 11.8% తగ్గగా, ఐదు దేశాల్లో మాత్రమే ఎగుమతులు జరిగాయి. స్పెయిన్‌లో ఎగుమతులు 43.43% పెరిగాయి, చైనాలో 42.35% గా నమోదైంది. హాంకాంగ్ 6%, బ్రెజిల్ 3.54%, బెల్జియం 2.22% పెరిగాయి. ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల షిప్‌మెంట్లు ఈ వృద్ధికి కారణమయ్యాయి.
ఏ దేశాల్లో ఎగుమతులు పడిపోయాయి?
మిగతా 15 దేశాల్లో ఎగుమతులు పడిపోయాయి. అమెరికాకు ఎగుమతులు 8.58% తగ్గాయి, UAEలో 10.17% తగ్గింది. సింగపూర్ అత్యధికంగా 54.85% తగ్గింది, ఆస్ట్రేలియా 52.42%, ఇటలీ 27.66%, UK 27.16%, నెదర్లాండ్స్ 22.75% తగ్గాయి. మలేషియా -22.68%, దక్షిణ కొరియా -16.43%, జర్మనీ -15.14%, ఫ్రాన్స్ -14.28%, బంగ్లాదేశ్ -14.10%, నేపాల్ -12.64%, సౌత్ ఆఫ్రికా -7.54%, సౌదీ అరేబియా -1.12% నష్టాన్ని చూశాయి.
MSMEs కష్టాల్లో
భారత MSMEs మొత్తం ఎగుమతుల 40%కి పైగా కృషి చేస్తాయి. చాలా కంపెనీలు ఆర్డర్ రద్దులు, లాభనష్టాలు, వర్కింగ్ క్యాపిటల్ సమస్యలతో కష్టపడ్డాయి. CII UP MSME ప్యానెల్ కో-కోఆర్డినేటర్ రాజత్ మెహ్రా ఇలా .. “ప్రపంచ పరిస్థితులు కఠినంగా ఉన్నందున MSME ఎగుమతిదారులపై ఒత్తిడి పెరుగుతుంది.” అని ఆయన వెల్లడించారు.
టెక్స్టైల్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది
ICC నేషనల్ టెక్స్టైల్స్ కమిటీ చైర్మన్ సంజయ్ కే. జైన్ ఇలా “అమెరికా టారిఫ్స్ వల్ల టెక్స్టైల్ ఎగుమతులు ఇప్పటికే పడిపోయాయి. వచ్చే నెలల్లో ఈ నష్టాలు 15%కి పైగా చేరవచ్చు.” అని తెలిపారు.
భారత ఎగుమతుల స్లో డౌన్ దేశ ఆర్థిక పరిస్థితికి సవాలు చూపుతోంది. టారిఫ్స్, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ డిమాండ్ మార్పులు ఆల్ టూ గెదర్ భారత ఎగుమతిదారులపై ఒత్తిడి పెడుతున్నాయి. వ్యాపార రంగాలు వచ్చే కొన్ని నెలల్లో అనిశ్చిత పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాల్సి ఉంది.

