The Prime Minister Should Resign Call For New Elections The Concern In Israel
అంతర్జాతీయం

Israel Protest : ఇజ్రాయెల్‌లో స్థానికుల ఆందోళన, ప్రధానిపై ఆగ్రహం..

The Prime Minister Should Resign Call For New Elections The Concern In Israel: ఇజ్రాయెల్‌ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోని రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. టెల్ అవీవ్‌లో నిరసనకారులు”మేము భయపడము, మీరు దేశాన్ని నాశనం చేశారు, మేము దానిని సరిచేస్తాము” అని నినాదాలు చేశారు. మేము బందీలను సజీవంగా తిరిగి తీసుకొస్తామని, శవపేటికలలో కాదని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని నిరసనకారులు కోరారు.

హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ.. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ నిరసనకారులు భారీ ఎత్తున శనివారం ఆందోళన ఉధృతం చేశారు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమవారిని విడుదల చేయాలని నిరసనకారులు కోరారు. ఆందోళనకారులంతా భారీ ఎత్తున ఇజ్రాయెల్‌ వీధుల్లోకి చేరారు. టెల్‌ అవీవ్‌, సిజేరియా, హైఫా వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకుని ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందీల కుటుంబాలు తమవారిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నాయని కానీ బందీలను విడిపించడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. ఇదిలా ఉండగా తూర్పు లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. సిరియా సరిహద్దుకు సమీపంలోని జనతా గ్రామంలో హిజ్బుల్లా శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే, తూర్పు నగరమైన బాల్‌బెక్‌కు సమీపంలో ఉన్న సఫారి పట్టణంపై దాడి జరిగినట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.

Also Read: ఇజ్రాయెల్‌ని హెచ్చరించిన ఇరాన్, ప్రతీకారం తప్పదంటూ…

ఈ క్రమంలో ఓ వైపు ఇజ్రాయెల్ హమాస్ సహా ఉగ్రవాదులతో పోరాడుతుండగా మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఎక్కువయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా మంది బందీలను తిరిగి తీసుకురావడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ క్రమంలో బందీల కుటుంబాలు వారిని వెనక్కి తీసుకురావాలని ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైఫాలో నిరసనకారులు నెతన్యాహు విఫలమయ్యారని, ప్రభుత్వాన్ని దోషి అని పేర్కొన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని వేలాది మంది శనివారం రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు.అయితే ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, పలువురికి గాయాలయ్యాయి. గాజాలో ఇప్పటికీ హమాస్ చేతిలో ఉన్న దాదాపు వంద మంది బందీల కుటుంబాలతో మితవాద ప్రభుత్వ వ్యతిరేకులు ఏకం కావడంతో ప్రస్తుత ప్రధానిపై ఒత్తిడి పెరుగుతోంది. హమాస్ అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడిని ప్రారంభించి, దాదాపు 250 మందిని బంధించింది.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!