SpaceX Starship
అంతర్జాతీయం

SpaceX’s Starship Explodes: ఆకాశంలో భారీ పేలుడు.. భూమిపైకి దూసుకొచ్చిన శకలాలు

SpaceX’s Starship Explodes: అపరకుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) స్థాపించిన స్పేస్ ఎక్స్ (SpaceX) సంస్థ.. అంతరిక్ష రంగంలో గత కొంతకాలంగా తనదైన ముద్ర వేస్తోంది. పలు రాకెట్ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అత్యంత భారీ రాకెట్ స్టార్ షిప్ ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టింది. అయితే రాకెట్ కేంద్రం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే స్టార్ షిప్ ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయింది. రాకెట్ శకలాలు అగ్నిలో మండిపోతూ భూమిపైకి వస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

పేలుడుకు కారణమిదే!

అమెరికా టెక్సాస్ లోని బొకాచికాలో గల తన అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్టార్ బేస్ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థ ఈ స్టార్ షిప్ ను ప్రయోగించింది. సా.5:30 గంటలకు అంటే భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ రాకెట్ ను నింగిలోకి పంపారు. అయితే తొలుత విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన స్టార్ షిప్.. అనూహ్యంగా అంతరిక్షంలో పేలిపోయింది. రాకెట్ ఇంజిన్లు నియంత్రణ కోల్పోవడంతో ప్రయోగం విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో కాలి బూడిదవుతున్న రాకెట్ శకలాలు.. దక్షిణ ఫ్లోరిడా, బహమాస్ పరిసరాల్లోని ఆకాశంలో దర్శనమిచ్చాయి. స్థానికులు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియా చేశారు.

విమాన రాకపోకలకు అంతరాయం

స్పేస్‌ ఎక్స్ రాకెట్ ప్రయోగం విఫలం కావడంతో పాటు ఆకాశంలో వాటి శకలాలు భారీగా విస్తరించడంతో పలు విమాన సర్వీసులు అధికారులు నిలిపివేశారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) హెచ్చరించడంతో మియామీ, ఫోర్ట్ లౌడేర్డేల్, ఓర్లాండో, పామ్ బీచ్ విమానాశ్రయాల్లో గంటపైగా విమాన రాకపోకలు నిలిపివేశారు. శకలాలు పూర్తిగా తొలిగిన అనంతరం రాకపోకలను పునరుద్ధరించారు.

స్పెస్ ఎక్స్ స్పందన ఇదే

రాకెట్ ప్రయోగం విఫలం కావడంపై స్పేస్ ఎక్స్ సంస్థ స్పందించింది. ఆ సంస్థ ప్రతినిధి డాన్ హుట్ మాట్లాడారు. దురదృష్టకర ఘటనగా దీనిని అభివర్ణించారు. గతంలో చేపట్టిన ప్రయోగం సైతం ఇలాగే జరిగిందని గుర్తుచేశారు. మిషన్ ఫెయిల్యూర్ గల కారణాలపై తాము దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల జనవరిలో చేపట్టిన భారీ రాకెట్ స్టార్ షిప్ ప్రయోగం సైతం విఫలమైంది. సాంకేతికర కారణాలతో ఈ ప్రయోగం విఫలమైనట్లు అప్పట్లో స్పేస్ ఎక్స్ ప్రకటించింది.

Also Read: Tahawwur Rana: ‘పాపం పండింది’.. ముంబయి దాడుల సూత్రధారికి బిగ్ షాక్

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!