S-500 Missile : రష్యా, చైనా దేశాలు ఇంకా దగ్గరైపోతూ, రక్షణ రంగంలో మంచి స్నేహం పెంచుకుంటున్నాయి. ఈ మధ్యే చైనా టాప్ జనరల్స్ ఓ బృందం మాస్కో వెళ్లి రష్యా పెద్దలతో కీలక మీటింగ్స్ పెట్టారు. ఈ మీటింగ్స్‌లో క్షిపణి రక్షణ, భద్రతా వ్యవస్థల మీద కలిసి పనిచేద్దాం అంటూ రెండు దేశాలు చర్చలు జరుపుతున్నారు. రష్యా చైనాకు తన కొత్త S-500 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్న వార్త బయటకొచ్చింది. దీంతో, చైనా త్వరలోనే ఈ సిస్టమ్‌ను తీసుకునే అవకాశముందని అంతర్జాతీయస్థాయిలో పెద్ద చర్చ మొదలైంది.
Also Read: Skin Care: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం చేయొద్దు.. వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించండి!
రెండు దేశాలు కలిసి కొత్త రక్షణ ప్లాన్ రెడీ చేస్తున్నాయ్
చైనా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, చైనా సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యువ్షియా, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలుసోవ్‌ను కలిశారు. ఈ మీటింగ్‌లో రెండు దేశాలు తమతమ సైన్యాల మధ్య ఇంకా బలమైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలన్న దానిపై చర్చించారు.
రష్యా మంత్రి బెలుసోవ్ మాట్లాడుతూ.. “చైనా–రష్యా రక్షణ సహకారానికి కొత్త బ్లూప్రింట్ తయారవుతోంది. మన మధ్య ఉన్న విశ్వాసమే ఈ సంబంధానికి బలం” అని చెప్పాడు. అదే సమయంలో, మాస్కోలో జరిగిన మరో మీటింగ్‌లో మిసైల్ రక్షణ, వ్యూహాత్మక భద్రతపై రెండు దేశాల అధికారులు ముచ్చటించారు. ప్రపంచానికి ప్రమాదం కలిగించే అంశాలేంటి ? వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? అనే వాటిపై కూడా ఇరు దేశాలు చర్చించాయి.
అమెరికా క్షిపణి కవచ ప్రణాళిక వల్లే రష్యా–చైనా కలిసి పనిచేస్తున్నాయా?
ఈ చర్చలన్ని జరుగుతున్న టైంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన “గోల్డెన్ డోమ్” మిసైల్ షీల్డ్ ప్రాజెక్ట్ రష్యా–చైనాలను అసహనానికి గురిచేస్తోంది. అలాగే, 30 ఏళ్ల తర్వాత మళ్లీ అణు పరీక్షలు స్టార్ట్ చేసే సూచనలు కూడా ట్రంప్ ఇచ్చాడు. ట్రంప్ రష్యా, చైనా దేశాలతో అణు తగ్గింపు చర్చలు చేద్దామని ముందుకు వస్తున్నా .. చైనా మాత్రం ఆ దిశగా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైగా, చైనా వేగంగా తన అణు ఆయుధాలు పెంచుకుంటుండటంతో ప్రపంచంలో పవర్ బ్యాలెన్స్ మారిపోతుందన్న టెన్షన్ కూడా పెరుగుతోంది.

