Oreshnik Missile: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడుతుందన్న సంకేతాలు కనుచూపుమేరల్లో కనిపించడం లేదు. పైగా, రోజుకో రూపంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం కూడా షాకింగ్ పరిణామం జరిగింది. శుక్రవారం రాత్రి వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో కీవ్ నగరంలో నలుగురు చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడినట్టు కథనాలు వెలువడుతున్నాయి. కాగా, రష్యా జరిపిన దాడి కీవ్‌లోని ఖతార్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఖైదీల మార్పిడిలో ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో 13 బాలిస్టిక్ మిసైల్స్, 22 క్రూయిజ్ క్షిపణులు, 242 డ్రోన్లు, ఒక ఒరెష్నిక్ (Oreshnik) క్షిపణిని (Oreshnik Missile) రష్యా ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివరాలు వెల్లడించారు. వీటిలో ఒరెష్నిక్ క్షిపణి చాలా శక్తివంతమైనది. ధ్వని కంటే ఏకంగా 10 రెట్ల ఎక్కువ వేగంగా ఇది ప్రయాణిస్తుంది.
అంటే, గంటకు 13,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఈ క్షిపణిని అడ్డుకోవడం దాదాపుగా అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే భారీ వేగాన్ని ఏ రక్షణ వ్యవస్థ కూడా అడ్డుకోలేదని రష్యా భద్రతా వర్గాలు చెబుతున్నాయి. సాధారణ యుద్ధనౌకల నుంచి ప్రయోగించినా, ఇది అణ్వాయుధానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు. కాగా, క్షిపణి 5,500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అంటే, రష్యా నుంచి యూరప్‌లోని ఏ ప్రాంతాన్నైనా ఇది సులభంగా చేరుకోగలదు. నవంబర్ 2024లో ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై మొదటిసారి దీనిని ప్రయోగించినట్టుగా కథనాలు వెలువడ్డాయి. తాజా దాడితో రెండోసారి ప్రయోగించినట్టు అయ్యింది. ఈ దాడితో యూరోపియన్ యూనియన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసే దాడిగా అభివర్ణించింది.
Read Also- CM Revanth Reddy: సుజన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభోత్సవంలో.. సీఎం కీలక వ్యాఖ్యలు..!
దాడి అందుకేనా…
రష్యన్ అధ్యక్ష భవనంపై ఇటీవలే ఉక్రెయిన్ దాడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఆ దాడికి ప్రతికారంగానే రష్యా తాజాగా ఈ దాడికి పాల్పడినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, రష్యాపై తాము ఎలాంటి దాడి చేయలేదని ఉక్రెయిన్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలాంటి దాడి జరగలేదని చెప్పారు. పుతిన్ భ్రమల ఆధారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఖండించారు. యూరోపియన్ సరిహద్దులకు సమీపంలో ఇలాంటి దాడులు జరగడం అంతర్జాతీయ భద్రతకు ముప్పు అని ఇచ్చారు.
కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మొదలైంది. అప్పటినుంచి కొనసాగుతూనే ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో అత్యంత ప్రాణాంతకమైన ఘర్షణ ఇదే కావడం గమనార్హం. గడ్డకట్టే చలి, రోడ్లపై కుప్పలుకుప్పలుగా మంచు పేరుకుపోయిన క్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Russia fires Oreshnik hypersonic missile at Lviv, first confirmed strike in western Ukraine
Mayor confirms 6 explosions targeting infrastructure near Poland 🅱️order
Hypersonic IRBM traveled 1,500km in 7 minutes at Mach 10
No air defense can intercept this weapon system pic.twitter.com/wZE2X8YFYz
— Boi Agent One (@boiagentone) January 8, 2026

