Kim banned Red lipstick
అంతర్జాతీయం

North Koria: అక్కడ రూల్ అంతే

  • చిత్రవిచిత్రమైన నియమనిబంధనలు అమలు చేస్తున్న ఉత్తర కొరియా
  • ఆడవారు ఉపయోగించే రెడ్ లిప్ స్టిక్ పై నిషేధం
  • పెట్టుబడిదారీ విధానానికి రెడ్ లిప్‌స్టిక్ సంకేతమని వాదన
  • మహిళలు ఎలాంటి మేకప్ వేసుకోరాదని ఆదేశాలు
  • అనేక ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులపై కిమ్ నిషేధాజ్ణలు
  • కిమ్ తీరుపై మండిపడుతున్న ప్రజలు

North Koria Ban on Red lip stick president Kim decession public fire:
ఉత్తర కొరియా అధ్యక్షుడు మ్‌ జోంగ్‌ ఉన్‌ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. తన నియంత ధోరణితో అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటారు. ఆయన విధించే నియమనిబంధనలు, కట్టుబాట్లు, అభిరుచులు అన్నీ ఆయన ఇష్టం ప్రకారం జరగాలంటారు. ప్రజలు తినే తిండి, బట్టలు అన్నీ కూడా కిమ్ నిర్ణయిస్తుంటారు. అందుకు విరుద్ధంగా ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు సైతం విధిస్తుంటారు. తాజాగా, మహిళలు పెదవులకు ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ పూసుకోవడంపై నిషేధం విధించారు. రెడ్ లిప్‌స్టిక్‌ను పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా కిమ్ రాజ్యం భావిస్తోంది. అంతేకాదు, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని బలమైన నమ్మకం. ఇప్పటికే ఉత్తర కొరియాలో మహిళల మేకప్‌పై నిషేధం కొనసాగుతోంది. మహిళల అలంకరణ పాశ్చాత్య సంస్కృతి అని, వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పశ్చిమ దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనేది కిమ్‌ భయం. ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని ప్రచారం చేస్తోంది కిమ్ ప్రభుత్వం. లిప్‌స్టిక్‌ వేసుకోవడం తమ దేశ నియమాలకు విరుద్ధమని అక్కడి పాలకుల అభిప్రాయం.

కిమ్ అంటేనే కఠిన చట్టాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకువస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయన శాసిస్తుంటారు. తాజాగా మహిళలు రెడ్‌ లిప్‌స్టిక్‌ వాడొద్దనే మరో నిబంధనను కిమ్‌ తీసుకొచ్చారు. రెడ్‌ లిప్‌స్టిక్‌ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోంది. అది కమ్యునిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం. ఇప్పటికే ఆ దేశంలో మేకప్‌పై నిషేధం ఉంది. దీన్ని అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారని కిమ్‌ భయం! ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. లిప్‌స్టిక్‌ వేసుకోవడం ఉత్తర కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడి నాయకుల భావన.

ఫ్యాషన్ బ్రాండ్లపై

ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక ఫ్యాషన్‌ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్‌, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్‌ స్టైళ్లపై నిషేధం ఉంది. మహిళలు, పురుషులు ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి. ఇంకొన్ని నిబంధనలనైతే.. కిమ్‌ తనను ఎవరూ అనుకరించొద్దనే ఉద్దేశంతో అమలు చేస్తున్నారు. ఆయన తరహాలో జుట్టును కత్తిరించుకోవడం, నలుపు రంగు ట్రెంచ్‌ కోట్లు ఎవరూ ధరించొద్దనే నిబంధన ఉంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారికి ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. జీన్స్‌ ధరించి రోడ్డుపై కనిపిస్తే.. అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా కత్తిరిస్తారు. జుట్టు కూడా అంతే.

Just In

01

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ