KP-Sharma-Oli
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Nepal PM Resigns: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా.. రంగంలోకి ఆర్మీ

Nepal PM Resigns: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జెన్ జెడ్’ తరం యువత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి పదవికి కేపీ ఓలీ శర్మ రాజీనామా (Nepal PM Resigns) చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్న సమయంలో ఆయన పదవి నుంచి దిగిపోయారు. ప్రధానమంత్రి రాజీనామా చేయాలనేది ‘జెన్ జెడ్’ నిరసనకారుల ప్రధానమైన డిమాండ్‌గా ఉంది. దేశానికి కీలకమైన పార్లమెంట్‌ భవనం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి నివాసాలకు నిరసనకారులు నిప్పు పెట్టడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో, ప్రధాని పదవి నుంచి దిగిపోవాలంటూ కేపీ ఓలీ శర్మను నేపాల్ ఆర్మీ చీఫ్, జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ కోరారు. ఈ తీవ్ర సంక్షోభం నుంచి దేశాన్ని ఒక్క ఆర్మీ మాత్రమే గట్టెక్కించగలదని, దేశానికి తిరిగి స్థిరత్వాన్ని తీసుకొస్తుందని కేపీ ఓలీకి ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. ప్రధాని దిగిపోయిన వెంటనే రంగంలోకి దిగేందుకు ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ప్రధాని దిగిపోయినా ప్రభుత్వం పడిపోదు!

ప్రధానమంత్రి రాజీనామా చేయాలన్నది నిరసనకారుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. తద్వారా నిరసనకారులు అనుకున్నది సాధించారు. కానీ, నేపాల్‌ చట్టాల ప్రకారం, ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయినా ప్రభుత్వ పతనం అయినట్టు కాదు. ఎందుకంటే, ఆ దేశంలో ప్రభుత్వాధిపతిగా రాష్ట్రపతి ఉంటారు. ప్రధానమంత్రిని కార్యనిర్వహక అధిపతిగా పరిగణిస్తారు. అందుకే, ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేసినా.. ప్రభుత్వం పడిపోదు. ప్రస్తుతం ఆ దేశ రాష్ట్రపతిగా రామ్ చంద్ర పౌడెల్ ఉన్నారు. ఆయన కూడా రాజీనామా చేసినప్పుడే ప్రభుత్వం పడిపోతుందని అక్కడి రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాష్ట్రపతి రామ్ చంద్ర పౌడెల్ కూడా త్వరలోనే రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అదే జరిగితే, ప్రభుత్వం పూర్తిగా కుప్పకూలుతుంది.

Read Also- Nepal GenZ Protests: నేపాల్‌లో అల్లకల్లోలం.. రాష్ట్రపతి భవన్‌కు నిప్పు.. ప్రధాని ఇల్లు ధ్వంసం

కాగా, రెండు రోజుల హింసాత్మక ఆందోళనల్లో ఏకంగా 25 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. ఈ నిరసనలకు ‘జెన్ జెడ్’ తరానికి చెందిన యువత నేతృత్వం వహిస్తోంది. కాగా, రెండు రోజుల హింసాత్మక ఆందోళనల్లో ఏకంగా 25 మంది మృతి చెందారు. అనేకమంది గాయపడ్డారు. ఈ నిరసనలకు ‘జెన్ జెడ్’ తరానికి చెందిన యువత నేతృత్వం వహిస్తోంది. నిరసనల్లో తొలి రోజైన సోమవారం నిరసనకారులు అనూహ్యంగా రోడ్లపైకి దూసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు అయిన ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో, జెడ్‌ జెడ్ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలు, దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించాయి.

Read Also- Raj Kundra Fraud: చీటింగ్ కేసులో రాజ్ కుంద్రాకు పోలీసులు సమన్లు.. అయినా అవేం పనులు

పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తొలగించినప్పటికీ, నిరసనల ఉధృతి మాత్రం తగ్గలేదు. ప్రభుత్వ అవినీతి, పక్షపాతానికి వ్యతిరేకంగా మంగళవారం కూడా యువత రోడ్లపైకి వచ్చారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. అక్కడితో ఆగకుండా ప్రధాని, రాష్ట్రపతి నివాసాలకు నిప్పు కూడా పెట్టారు. అధికారంలో నేతల పిల్లలను అందలం ఎక్కిస్తున్నారని, సామాన్య యువతను పట్టించుకోవడంలేదని జెన్ జెడ్ తరం యువతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Just In

01

KTR: ఫార్ములా-ఈ కారు కేసు ఒక లొట్టపీసు కేసు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

CP Radhakrishnan: భారత 14వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. తెలుగు అభ్యర్థిపై గెలుపు

Digital Crop Survey: పంటల నమోదుకు సాంకేతికత.. పకడ్బందీగా డిజిటల్ క్రాప్ సర్వే!

Formula E Case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కీలక స్టెప్.. ఏం జరగబోతోంది?

K-Ramp Movie Song: ‘కె ర్యాంప్’ సినిమా నుంచి లిరికల్ వచ్చేసింది.. వారి కెమిస్ట్రీ కుదిరిందిగా..