Mark Zuckerberg | ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన కామెంట్లు చేశాడు. పాకిస్థాన్ లో తనకు మరణశిక్ష వేసేలా ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన రేపుతోంది. రీసెంట్ గా ఆయన జో రోగన్ పాడ్ కాస్ట్ లో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ లో ఎవరో ఒకతను దేవుడిని అవమానించేలా ఉన్న ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దాంతో ఫేస్ బుక్ అధినేత అయినందుకు నాకు మరణశిక్ష వేయాలంటూ పాకిస్థాన్ కోర్టులో దావా వేశారని’ జుకర్ బర్గ్ పేర్కొన్నారు.
‘చాలా దేశాల్లో మనకు నచ్చని చట్టాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు.. సంస్కృతి, సంప్రదాయాల మీద చాలా చట్టాలు బలంగా ఉన్నాయి. అక్కడ వాటిని అవమానిస్తూ ఒక్క పోస్టు పెట్టినా సరే ఆ దేశాలు మాకు నోటీసులు పంపిస్తున్నాయి. అందుకే ఫేస్ బుక్ లో చాలా కంటెంట్ ను తొలగిస్తున్నాం’ అని మార్క్ జుకర్ బర్గ్ కామెంట్ చేశాడు. ఈ నడుమ ఫేస్ బుక్ పై చాలా అభియోగాలు వస్తున్నాయి. అక్కడ విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టులు వెలుస్తున్నాయంటూ ఫిర్యాదులు రావడంతో ఫేస్ బుక్ ఈ రకమైన కంటెంట్ మీద నిషేధం విధిస్తోంది.