Maldeevs requesting indians
అంతర్జాతీయం

Maldives: మాల్దీవులకు రండి

Maldives tourism minister requesting indian tourists to come their country:
భారత్ తో గతేడాది పర్యాటకపరంగా తీవ్రంగా దెబ్బతిన్న మాల్దీవులు కోలుకోలేకపోతోంది. అప్పటిదాకా మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో అది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. దెబ్బకు మాల్దీవుల ప్రభుత్వం దిగొచ్చింది. తమ దేశానికి రావాలంటూ భారతీయ టూరిస్టులను వేడుకుంటోంది. పూర్తిగా తమ దేశం పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉందని దయచేసి అర్థం చేసుకుని భారతీయ పర్యాటకులు రావాలని ఆ దేశపర్యాటక శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్ విజ్ఞప్తి చేశారు. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది.

కలిసుందాం..సహకరించండి

దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది.. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా (భారత్‌తో) కలిసి పనిచేయాలని కోరుకుంటోంది.. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం… భారతీయుల రాకపోకలకు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి… దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను.. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది’ అని అన్నారు.

ఆరోస్థానానికి పడిపోయిన భారత పర్యాటకులు

భారత్‌పైనా, ప్రధాని మోదీపైనా అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బాయ్‌కాట్ మాల్దీవులకు అని పిలుపునివ్వడంతో ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్నవారు మనసు మార్చుకున్నారు. హోటల్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. మాల్దీవుల నష్టనివారణ చర్యలు చేపట్టి భారత్‌పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు. పర్యాటక వైబ్‌సైట్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 42 శాతం తగ్గింది. ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు తొలిస్థానంలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం వీరి సంఖ్య ఆరో స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!