Iron Lungs man died untimely, fans are in mourning
అంతర్జాతీయం

Iron Lungs : ఐరన్‌ లంగ్స్‌ వ్యక్తి అకాల మృతి, శోకసంద్రంలో ఫ్యాన్స్

Iron Lungs Man Died Untimely, Fans Are in Mourning :చాలామంది చాలా సమస్యలతో బాధపడుతుంటారు.కానీ.. వారి సమస్యలకు వైద్యశాస్త్రంలో తాత్కాలిక పరిష్కారం దొరుకుతుంది. అందులో ఒకతను ఈ ఇనుప ఊపిరితిత్తుల రోగి. ఈయన ఎంతగానో పేరుపొందిన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. తాజాగా 78 ఏండ్ల వయసులో మృత్యువాతపడ్డారు.టెక్సాస్‌కు చెందిన పాల్ అలెగ్జాండర్. 1952లో ఆరేళ్ల వయసున్నప్పుడు పోలియో వ్యాధి బారినపడ్డాడు. అప్పటికి పోలియో టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో తనకు ఇనుప ఊపిరితిత్తులను అమర్చారు వైద్యులు.

చాలామందికి అంగవైకల్యం కలిగించే పోలియో వ్యాధి, పాల్ విషయంలోనూ తీవ్రంగా సోకింది. దీంతో మెడ కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఊపిరితిత్తుల కండరాలు కూడా పూర్తిగా పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది తనకి. దీంతో వైద్యులు అతడికి ఐరన్ లంగ్స్‌గా పేరుపడ్డ జీవనాధార వ్యవస్థను ఫిక్స్‌ చేశారు. పెద్ద గొట్టం ఆకారంలో ఉండే ఈ పరికరంలో రోగిని ఉంచుతారు. ఇది పెషెంట్లకు బదులుగా శ్వాస తీసుకుని ఆక్సిజన్ సరఫరా చేస్తుందన్నమాట. 1955లో పోలియో టీకా అందుబాటులోకి వచ్చినా పాల్ విషయంలో మాత్రం అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో, అతడు ఆ తరువాత 70 ఏళ్ల పాటు ఐరన్ లంగ్స్‌తోనే తన జీవనాన్ని కొనసాగించాడు.

Read More: గాల్లో పేలిన జపాన్ ప్రైవేట్ రాకెట్

అయితే, ఒళ్లంతా చచ్చుబడినా కూడా ఆయన జీవితంపై గట్టి నమ్మకంతో జీవించాడు. లాయర్ కోర్సుని అభ్యసించి లాయర్ అయ్యాడు పాల్.. ‘త్రీ మినిట్స్ ఫర్ డాగ్’ పేరిట తన ఆత్మకథను కూడా ప్రచురితం చేశాడు. ఈ ప్రతులు అనూహ్య రీతిలో అమ్ముడుపోయాయి. కాగా.. పాల్ మార్చి 12న కన్నుమూసినట్టు వికలాంగుల హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ అల్మర్ గోఫండ్ మీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. పాల్‌ను క్రిస్టోఫర్ 2022లో ఇంటర్వ్యూ చేశారు. ‘‘పాల్ జీవితం వరల్డ్‌వైడ్‌గా ఎందరినో ప్రభావితం చేసింది. అంతేకాకుండా అతడు ఎందరికో రోల్ మోడల్ కూడా. అతడు ఎప్పటికీ మన మనసుల్లోనే ఉంటాడని క్రిస్టోఫర్ రాసుకొచ్చాడు.

వైరస్ కారణంగా వ్యాపించే పోలియో ఐదేళ్ల లోపు చిన్నారులను టార్గెట్ చేస్తుందన్న విషయం మనందరికి తెలిసిందే. మానవ విసర్జితాల కాలుష్యం ద్వారా ఇది వ్యాపిస్తుంది. దీని బారినపడ్డ ప్రతి 2 వేల మందిలో ఒకరికి శరీరం చచ్చుబడుతుంది. 5 – 10 శాతం కేసుల్లో మాత్రం ఊపిరితిత్తుల కండరాలు సైతం చచ్చుబడటంతో రోగులు శ్వాస అందక మరణిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే అప్పట్లో ఐరన్ లంగ్స్ పరికరాన్ని రూపొందించారు. భారీ గొట్టం ఆకారంలో ఉండే ఈ యంత్రంలో రోగిని ఉంచి కృత్రిమ శ్వాస అందించేవారు. 1928లో తొలిసారిగా ఈ యంత్రాన్ని వినియోగించారు. ఇక పోలియో టీకా అందుబాటులోకి వచ్చాక అనేక దేశాల్లో పోలియో వ్యాధి రూపు మాసిపోయిందనే చెప్పాలి.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం