Iran US Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో సోమవారం రాత్రి అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తమ దేశ అణుకేంద్రాలపై అగ్రరాజ్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. మొత్తం ఆరు క్షిపణులతో దాడులు జరిపింది. ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఖతార్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు జరిపిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇరాన్ క్షిపణుల దాడి ప్రభావం ఎంత?, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
Read this- Maharashtra: క్షమించు తల్లి.. తండ్రి కాదు కాలయముడు!
కాగా, శనివారం రాత్రి అమెరికా బీ-2 బాంబర్లతో ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిపింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. తాజా దాడితో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయింది. ఇరాన్ దాడులపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది. ఇరాన్ ప్రతీకార దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సిచ్యువేషన్ రూమ్’లో సమీక్ష జరుపుతున్నారు. ప్రతిఘటనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Read this- Syringe Horror:145 మందిపై సిరంజి దాడులు.. అందులో ఏముంది?
ఇరాన్ దాడులకు కొన్ని గంటల ముందే ఖతార్‌లోని అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి యూఎస్ ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు అక్కడే భద్రంగా ఆశ్రయం పొందాలని సూచించింది. వివరాలు ఏమీ చెప్పలేదు, కానీ,‘చాలా జాగ్రత్తగా’ ఉండాలని పౌరులను హెచ్చరించింది. ఖతార్ తన గగన తలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. దీంతో, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దోహా నుంచి వెళ్లే విమానాలను దారి మళ్లించాల్సి వస్తోంది. మరోవైపు, ఇరాన్‌ను ప్రతిఘటించే హక్కు తమకు ఉందని ఖతార్ ప్రకటించింది.