Flight Accident : సూడాన్ లో (Sudan) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశంలోని వాడి సయిద్నా ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిని సైనిక విమానం కొద్ది సేపటికే ఇండ్ల నడుమ కుప్పకూలింది. ఈ ఘటనలో స్పాట్ లోనే 46 మంది సైనికులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. విమానం కూలిన ప్రదేశంలో కూడా కొంత మంది గాయపడ్డట్టు తెలుస్తోంది.
ఇక చాలా రోజులుగా సూడాన్ లో సైన్యంకు, ర్యాపిడ్ ఫైర్ సపోర్టు ఫోర్స్ కు మధ్య ఆధిపత్యం విషయంలో అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ పై పట్టు కోసం రెండు వర్గాలు బలంగా పోరాడుతున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటికే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కూలిన విమానం కూడా సైన్యంకు సంబంధించినదే కావడం గమనార్హం.